iDreamPost

ఇళ్ళ ముందు కరెన్సీ నోట్లు.. పెరిగిపోతున్న టెన్షన్

ఇళ్ళ ముందు కరెన్సీ నోట్లు.. పెరిగిపోతున్న టెన్షన్

రోడ్లపైన కరెన్సీ నోట్లు దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా ? కనీనం ఆ నోట్లు ఎవరిదో ఆరా తీయటానికైనా సరే ముందుగా నోట్లను తీసుకుంటారు. జేబులో వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళుంటారు. మరికొందరు నోట్లు పోగొట్టుకున్న వాళ్ళ గురించి వాకాబు చేస్తారు కూడా. తర్వాత ఏమి చేస్తారనే విషయం అప్పటి పరిస్ధితిని బట్టి నిర్ణియించుకుంటారు. అలాంటిది నోట్లు ఏకంగా తమ ఇళ్ళ ముందే దర్శనం ఇస్తున్నా ముట్టుకోవటానికి కూడా భయపడిపోతున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా ? తెలీకపోతే ఈ కథనం చదవాల్సిందే.

బీహార్ లోని సహస్ర అనే పట్టణం ఉంది లేండి. ఆ పట్టణంలోని ఓ ఏరియాలో కొన్ని ఇళ్ళ ముందు తెల్లవారి లేచి తలుపులు తీసేసరికి గుమ్మం ముందు కొన్ని కరెన్సీ నోట్లు పడున్నాయి. 20, 50, 100 రూపాయల నోట్లు పడుండటంతో యజమానులు ముందు ఆశ్చర్యపోయారు. ఒకసారి కాదు తరచూ జరుగుతోందట. పోనీ అదేమన్నా ఒకటో రెండో ఇళ్ళముందు జరుగుతోందా అంటే అదీ కాదు.

తమ ఏరియాలోని చాలా ఇళ్ళముందు ఇలాగే వరుసగా జరుగుతుండటంతో యజమానులు భయపడిపోయారట. కరెన్సీ నోట్లు కనబడితే భయపడిపోవటం ఏమిటి ? ఏమిటంటే నోట్లతో మరో నోట్ అదేనండి చేతి రాతతో కూడిన ఓ పేపర్ కూడా ఉంటోందట. అందులో ఏముందంటే తాను కరోనా వైరస్ అని నోట్లు తీసుకోకపోతే ఇంట్లోని వాళ్ళందరికీ వైరస్ అంటించేస్తానని రాసుందట.

దాంతో ఇళ్ళల్లోని వాళ్ళు భయపడి వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అంటే కరెన్సీ నోట్ల ద్వారా ఎక్కడ వైరస్ సోకుతుందో అన్న భయంతోనే చివరకు నోట్లను కూడా తీసుకోవటానికి ఇళ్ళలోని వాళ్ళు భయపడుతున్నారన్న విషయం అర్ధమైపోయింది కదా. సరే ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు లేండి. స్లిప్పుల్లోని చేతిరాతను బట్టి ఒకే వ్యక్తి రాసిందన్న విషయం బయటపడింది. ఇక డబ్బులు, స్లిప్పులను వదిలిపెడుతున్నదెవరో తేలాలి. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ సోకుతుందో లేదో నిర్మల సీతారామనే తేల్చాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి