iDreamPost

IPL 2024: SRHతో మ్యాచ్.. చెన్నై ప్లేయర్ ఆల్ టైమ్ రికార్డ్! IPL చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే..

SRHతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. మరి ఆ రికార్డ్ ఏంటో తెలుసుకుందాం పదండి.

SRHతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. మరి ఆ రికార్డ్ ఏంటో తెలుసుకుందాం పదండి.

IPL 2024: SRHతో మ్యాచ్.. చెన్నై ప్లేయర్ ఆల్ టైమ్ రికార్డ్! IPL చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే..

ఐపీఎల్ 2024 సీజన్ రికార్డులకు పెట్టింది పేరుగా మారిపోయింది. జట్లు భారీ స్కోర్లు చేస్తూ.. గత సీజన్లలో నెలకొల్పిన రికార్డ్ లను ఇప్పటికే బద్దలు కొట్టగా.. బ్యాటర్లు సైతం తమ వ్యక్తిగత రికార్డ్ లను బ్రేక్ చేసే పనిలో పడ్డారు. ఇక ఈ సీజన్ లో బౌలర్లు భారీగా పరుగులు ఇస్తూ నిరాశపరుస్తున్నారనే చెప్పాలి. ఇలాంటి టైమ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ డార్లీ మిచెల్ ఐపీఎల్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ ను సమం చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా మిచెల్ నిలిచాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో నిన్న(ఆదివారం) జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ డార్లీ మిచెల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సాధారణంగా మ్యాచ్ ల్లో బ్యాటర్లు సెంచరీ కొట్టడం, బౌలర్లు 5 వికెట్లు తీయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఓ ఫీల్డర్ 5 క్యాచ్ లు పట్టడం మాత్రం చాలా అరుదైన సంఘటన అనే చెప్పాలి. పైగా టీ20ల్లో ఇది దాదాపు అసాధ్యమే. కీపర్లకు మాత్రమే ఇది సాధ్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే అలాంటి అసాధ్యాన్ని సన్ రైజర్స్ తో మ్యాచ్ లో సుసాధ్యం చేశాడు చెన్నై ప్లేయర్ డార్లీ మిచెల్. ఈ మ్యాచ్ లో ఏకంగా 5 అద్భుతమైన క్యాచ్ లు అందుకుని సన్ రైజర్స్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, షహబాజ్ అహ్మద్, ప్యాట్ కమ్మిన్స్ ల క్యాచ్ లను అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న రెండో ప్లేయర్ గా నిలిచాడు మిచెల్. ఇంతకు ముందు ఈ ఘనత మహ్మద్ నబీ పేరిట ఉండేంది. అతడు 2021లో ముంబైై ఇండియన్స్ పై సన్ రైజర్స్ తరఫున ఆడుతూ 5 క్యాచ్ లు అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డ్ ను సమం చేశాడు మిచెల్. కాగా.. ఈ ఐపీఎల్ వేలంలో రూ. 14 కోట్లకు అమ్ముడుపోయిన డార్లీ మిచెల్ బ్యాటింగ్ లో విఫలం అవుతూ వస్తున్నాడు. ఈ మ్యాచ్ లో మాత్రం ఫిఫ్టీతో రాణించాడు. మరి ఒకే మ్యాచ్ లో 5 క్యాచ్ లు పట్టడం మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి