iDreamPost

క్రష్ సినిమా రిపోర్ట్

క్రష్ సినిమా రిపోర్ట్

ఈ మధ్య టాలీవుడ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజులు బాగా తగ్గిపోయాయి కానీ నిన్న ఓ సినిమా జీ5 లో వచ్చిన సంగతి అసలు జనాలకు పెద్దగా తెలియకుండానే విడుదలైపోయింది. అవును, అల్లరి, అమరావతి, అనసూయ, నచ్చావులే లాంటి డిఫరెంట్ క్రైమ్ అండ్ లవ్ స్టోరీస్ తో పేరు తెచ్చుకున్న దర్శకుడు కం నటుడు రవిబాబు తీసిన మూవీ కావడంతో అంతో ఇంతో అంచనాలు నెలకొన్నాయి. అయితే లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న క్రష్ ఇక థియేటర్లలో వదలడం కష్టమని గుర్తించి ఎట్టకేలకు డిజిటల్ కు ఓటేశారు. ప్రమోషన్ లో ఇదో అడల్ట్ కంటెంట్ ని ముందే చెప్పేయడంతో అంచనాలు కూడా అంతంతే. మరి ఇదెలా ఉందో రివ్యూలో చూద్దాం.

అమెరికా వెళ్లాలనే ప్లాన్ లో ఉన్న ముగ్గురు స్నేహితులు తమ సీనియర్ చెప్పిన ఒక చచ్చు సలహా కారణంగా వర్జినిటీ కోల్పోవడానికి ప్లాన్ చేసుకుంటారు. అలా చేయకపోతే యుఎస్ లో అమ్మాయిలు చాలా చులకనగా చూస్తారనే మాటను గుడ్డిగా నమ్మి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతారు. అక్కడి నుంచి జరిగే సంఘటనలే మిగిలిన సినిమా. ఇంతకు మించి ఇందులో స్టోరీ ఏమి లేదు. త్రీ ఫ్రెండ్స్ గా నటించిన అభయ్ సింహా, కృష్ణ బూర్గుల, చరణ్ సాయి డైరెక్టర్ రవిబాబు చెప్పినట్టు చేసుకుంటూ పోయారు. అర్జున్ రెడ్డి ఫేమ్ శ్రీసుధా కూడా తన శక్తి మేరకు దర్శకుడు అడిగిన పెర్ఫార్మన్స్ కంటే ఎక్కువే ఇచ్చింది. మిగిలిన వాళ్ళ గురించి చెప్పడానికి ఏమి లేదు

టెక్నికల్ గా మంచి టాలెంట్ ఉన్న రవిబాబు మరీ ఇలా థర్డ్ గ్రేడ్ సినిమాలు ఎందుకు తీస్తున్నాడో అర్థం కాదు. ఇవి ఖచ్చితంగా స్థాయిని తగ్గించేవే. అదుగో, ఆవిరితోనే తనలో టేకింగ్ ని పాతాళానికి తీసుకెళ్లిన ఇతను ఇప్పుడీ క్రష్ ద్వారా ఇంకో పది మెట్లు కిందకు దిగిపోయారు. తాను తీసింది యువత కోసమే అని సర్దిచెప్పుకోవచ్చు గాక. కానీ మరీ ఇంత బూతులతో, డబుల్ మీనింగ్ సన్నివేశాలతో నింపాల్సిన అవసరం లేదు. ఆయన డైరెక్టర్ అయిన లక్ష్యం ఇది కాదుగా. 2 గంటల 10 నిమిషాల నిడివి కూడా మైనస్సే. సెన్సార్ లేదనే ఒకే కారణంగా ఇంత విచ్చలవిడితనాన్ని ఓటిటిలో అయినా సరే తీయడం ఏ కోణంలోనూ మెచ్చదగింది కాదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి