iDreamPost

OTTలోకి రియల్ లైఫ్ క్రైమ్ థ్రిల్లర్.. ఆ హంతకుడు ఎవరు?

Real Life Crime Thriller: క్రైమ్ కథలు చాలానే చూసి ఉంటారు. కానీ, రియల్ లైఫ్ లో జరిగిన క్రైమ్ కథలు సిరీస్ లుగా రావడం మాత్రం కాస్త తక్కువనే చెప్పాలి. అలాంటి క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతోంది.

Real Life Crime Thriller: క్రైమ్ కథలు చాలానే చూసి ఉంటారు. కానీ, రియల్ లైఫ్ లో జరిగిన క్రైమ్ కథలు సిరీస్ లుగా రావడం మాత్రం కాస్త తక్కువనే చెప్పాలి. అలాంటి క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతోంది.

OTTలోకి రియల్ లైఫ్ క్రైమ్ థ్రిల్లర్.. ఆ హంతకుడు ఎవరు?

ఓటీటీలో చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ ఉంటాయి. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ అయితే అదిరిపోయే క్రైమ్ డ్రామాలు, సినిమాలు, సిరీస్లు అబ్బో చాలానే ఉన్నాయి. అయితే నెట్ ఫ్లిక్స్ ఉండే ప్రత్యేకత ఏంటంటే.. వీళ్లు రియల్ క్రైమ్ స్టోరీస్ ని బేస్ చేసుకుని వెబ్ సిరీస్లు చేస్తుంటారు. అలాగే రియల్ క్రైమ్స్ బేస్ చేసుకుని డాక్యుమెంటరీలు నిర్మిస్తూ ఉంటారు. అలాంటి ఒక క్రైమ్ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించింది. సాధారణంగానే నెట్ ఫ్లిక్స్ టేకింగ్, కంటెంట్ సెలక్షన్ అంటే ఫ్యాన్స్ కి ఒక రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. మరి.. ఆ అంచనాలను ఈ సిరీస్ అందుకోగలుగుతుందా? అసలు ఈ రియల్ లైప్ క్రైమ్ ఎక్కడ జరిగింది?

రియల్ లైఫ్ క్రైమ్ కి సంబంధించి డాక్యుమెంటరీలు, సిరీస్లు తీయడంలో నెట్ ఫ్లిక్స్ ఎంతో గొప్ప అనుభవం ఉంది. ఇప్పటికే చాలానే రియల్ క్రైమ్స్ కి రీల్ స్పేస్ కల్పించారు. తాజాగా తీసుకొస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ థ్రిల్లర్ ను బెర్లిన్ లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. నిజానికి 2012లో బెర్లిన్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఘటనగా చెప్తుంటారు. దీని పేరు క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ గా పెట్టారు. ఇది బెర్లిన్ లో జరిగిన హత్యల ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఫిల్మ్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఈ డాక్యుమెంటరీపై ఆసక్తినెలకొంది. ఎందుకంటే కల్పితమైన పాత్రలు, కల్పిత కథల కంటే కూడా ప్రేక్షకులకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అంటేనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే నెట్ ఫ్లిక్స్ కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ బెర్లిన్ క్రైమ్స్ కి జాన్ జాబీల్, కరోలిన్ షాపర్ దర్శకత్వం వహించారు.

ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని త్వరలోనే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయబోతోంది. ఏప్రిల్ 3 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని స్ట్రీమింగ్ చేయనున్నారు. మొత్తం 3 సీజన్స్ ఉంటాయి. 2012లో బెర్లిన్ లో ముగ్గురిని అతి దారుణంగా హత్య చేస్తారు. నిజానికి నలుగురిని చంపాలని చూస్తారు. కానీ, ఒకరు మాత్రం అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడతారు. అసలు వాళ్లని చంపింది ఎవరు? ఎందుకు వాళ్లని చంపాలని చూశారు? తప్పించుకున్న వ్యక్తి హంతకుడిని చూశారా? కేసు దర్యాప్తు ఎలా జరిగింది? అనే విషయాల ఆధారంగా ఈ సిరీస్ ఉంటుంది. మొత్తం రియల్ లైఫ్ క్రైమ్ కాబట్టే ఈ థ్రిల్లర్ అంటే అందరిలో అంత ఆసక్తి నెలకొంది. మరి.. నెట్ ఫ్లిక్స్ తీసుకొస్తున్న ఈ రియల్ లైఫ్ క్రైమ్ థ్రిల్లర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి