iDreamPost

భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్‌ మెన్

సమస్య ఏదైనా.. చాలా మంది సొల్యూషన్ కోసం ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. భార్యా భర్తలు గొడవలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దారుణ నిర్ణయానికి ఒడిగడుతున్నారు. అయితే జీవిత భాగస్వామితో పాటు కడుపున పుట్టిన బిడ్డల్ని బలితీసుకుంటున్నారు. తాజాగా..

సమస్య ఏదైనా.. చాలా మంది సొల్యూషన్ కోసం ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. భార్యా భర్తలు గొడవలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దారుణ నిర్ణయానికి ఒడిగడుతున్నారు. అయితే జీవిత భాగస్వామితో పాటు కడుపున పుట్టిన బిడ్డల్ని బలితీసుకుంటున్నారు. తాజాగా..

భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్‌ మెన్

భార్యా భర్తల మధ్య గొడవలైనా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పిల్లలను తల్లిదండ్రులే బలితీసుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అభం, శుభం తెలియని పసిగొడ్డులను పొట్టనపెట్టుకుంటున్నారు కన్నవారే. జీవిత భాగస్వామిపై కోపం ఉన్నా, అప్పుల భారంతో కుటుంబాన్ని ఈడ్చలేక బ్రతకడమే సమస్యగా మారిపోయిన సమయంలో ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. ఈ తీవ్ర పరిస్థితుల్లోనే కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన బిడ్డల్ని కిరాతకంగా హతమారుస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ వద్ద పనిచేసే గన్ మెన్ దారుణ నిర్ణయానికి పాల్పడ్డాడు. ఇంట్లో భార్య, బిడ్డలను చంపేసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. సిద్ది పేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గన్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యా పిల్లలను చంపి, ఆపై తాను కూడా అదే గన్ ‌తో కాల్చుకుని చనిపోయాడు. చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకుల నరేష్ గన్ మెన్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వద్ద పీఎస్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చాడు. వస్తూ.. తన వెంట 9ఎంఎం పిస్తోల్ తెచ్చాడు. రాగానే భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను కాల్చి చంపాడు. ఆపై అతడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ మృతికి కారణాలు తెలియరాలేదు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు అని తెలుస్తోంది. భార్య, పిల్లలను చంపి, అతడు ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫాజిల్.. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. లోన్ తీసుకోవడంతో .. వాటిని కట్టాలంటూ ఏజెంట్లు వేధించడంతో ఫాజిల్ కూడా గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.  సమస్య ఏదైనా..  పిల్లల్ని తల్లిదండ్రులే బలితీసుకుంటున్న ఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి