iDreamPost

పెళ్లై 6 నెలలే.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో

పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు పెద్దలు. కానీ ఇప్పటి జనరేషన్ లో వివాహం బంధం త్వరగా బీటలు వారిపోతుంది. చిన్న చిన్న సమస్యలు.. చిలికి చిలికి గాలి వానగా మారుతున్నాయి. ఒకరి అభిప్రాయాలు.. మరొకరికి నచ్చడం లేదు. దీంతో గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి.

పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు పెద్దలు. కానీ ఇప్పటి జనరేషన్ లో వివాహం బంధం త్వరగా బీటలు వారిపోతుంది. చిన్న చిన్న సమస్యలు.. చిలికి చిలికి గాలి వానగా మారుతున్నాయి. ఒకరి అభిప్రాయాలు.. మరొకరికి నచ్చడం లేదు. దీంతో గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి.

పెళ్లై 6 నెలలే.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో

సుమారు 20 నుండి 25 ఏళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న ఆడ పిల్లను పెళ్లి పేరుతో మరో ఇంటికి సాగనంపుతారు తల్లిదండ్రులు. అక్కడ కొత్త వాతావరణానికి ఇమడానికి, అక్కడ మనుషులతో సత్సంబంధాలు నెరపడానికి నూతన వధువుకు కొంత సమయం పడుతుంది. కాదూ.. పెళ్లైతే అన్ని వచ్చేయాలి, ఇల్లు చక్కదిద్దాలి, భర్త, అత్తమామల సేవలో తరించాలని అత్తింట పెట్టే ఆంక్షలతో.. ఆ ఇంటిని ఓ జైలుగా భావిస్తోంది కొత్తగా వచ్చిన కోడలు. వచ్చిన వెంటనే బాధ్యతల బందీఖానాలో వేయడం వల్ల.. వాటిని తట్టుకోలేక.. పుట్టింటికి వెళ్లి.. తోబుట్టువులతోనే, అమ్మ నాన్నలతో తన ఆవేదన వెలిబుచ్చుకోవాలని భావిస్తుంది. కానీ పుట్టినింటికి వెళ్లాలన్నా, అత్తింట్లో అందరి పర్మిషన్ తీసుకోవాలి. ఏ ఒక్కరు వద్దన్నా.. ఆగిపోవాల్సిందే.

పెళ్లై ఆరు నెలలు అవుతున్నా.. తనను పుట్టింటికి పంపించకపోవడంపై ఆ నూతన దంపతుల మధ్య గొడవలు రేగాయి. దీనికి తోడు అత్తింటి ఆరళ్లను తట్టుకోలేకపోయింది ఆ మహిళ. మనస్థాపానికి గురై.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెగూర్ గ్రామానికి చెందిన సురేష్ , మంజుల దంపతుల కుమార్తె మహేశ్వరి అలియాస్ స్వాతికి ఆరు నెలల క్రితం.. హంగల గ్రామానికి చెందిన వినయ్‍తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు గుండ్లుపేట్‌లోని దర్శన్ లే అవుట్‌లో నివసిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మహేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మరణ వార్త తెలిసి.. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ఆమె మెట్టినింటికి చేరుకున్నారు.

తల్లిదండ్రులు చెబుతున్న దాని ప్రకారం.. పెళ్లయి ఆరు నెలలు గడిచినా మహేశ్వరిని భర్త వినయ్, తన పుట్టింటికి పంపలేదని పేర్కొంటున్నారు. మహేశ్వరి అత్త నందిని సైతం ఆమెను వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా తన తల్లి మంజులతో మాట్లాడిందని తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లభ్యమైంది. అందులో ‘అమ్మ నేను నీకు మంచి కూతుర్ని కాదు. దయ చేసి నన్ను క్షమించండి. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. నీకుమంచి సోదరి దొరకలేదు. అమ్మ, నాన్నలను బాగా చూసుకో.. అందరూ బాగుండాలి. క్షమించండి’ ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త వినయ్, అత్త నందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి