iDreamPost

దేశద్రోహి అంటూ తండ్రిని చంపిన కొడుకు! యూట్యూబ్‌లో వీడియో పెట్టి..

ఇతడు మామాలూ కొడుకు కాదూ.. కిరాతకుడు. తండ్రి అని కూడా చూడకుండా.. చంపేసి.. ఆ తర్వాత యూట్యూబ్ లో వీడియోను పెట్టాడు. ఈ వీడియోలో పలు తీవ్ర ఆరోపలు చేశాడు.

ఇతడు మామాలూ కొడుకు కాదూ.. కిరాతకుడు. తండ్రి అని కూడా చూడకుండా.. చంపేసి.. ఆ తర్వాత యూట్యూబ్ లో వీడియోను పెట్టాడు. ఈ వీడియోలో పలు తీవ్ర ఆరోపలు చేశాడు.

దేశద్రోహి అంటూ తండ్రిని చంపిన కొడుకు! యూట్యూబ్‌లో వీడియో పెట్టి..

ప్రపంచంలో ఏ మూలన, ఏదీ జరుగుతున్న ఆ సమాచారం అంతా నెట్టిల్లు ఉండే సెల్ ఫోనులోకి చొచ్చుకుని వచ్చేస్తుంది. ఇక వీడియో రూపంలో కావాలంటే యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి మాధ్యమాలు ఎలానూ ఉండనున్నాయి. ఏమీ తోచక లేక, వ్యాపకం కోసం మొబైల్ తీసి.. అలా యూట్యూబ్ లోకి వెళితే.. వేలకొద్దీ వీడియోలు వద్దన్నా.. మన కళ్ల ముంగిట కనిపిస్తూ ఉంటాయి. అలా ఓ వీడియో యూట్యూబ్ ను షేక్ చేయడం కాదూ.. యూట్యూబ్ వాచ్ చేసే యూజర్ల వెన్నులో వణుకు పుట్టించింది. ఓ వ్యక్తి కవర్‌లో తల మాత్రమే కనిపించేలా వీడియోను యూట్యూబ్‌లో ఉంచాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు అదీ తొలుత బొమ్మ అనుకున్నారు. కానీ ఎంత సేపు పట్టలేదు.. అది మనిషి తల అని తెలిసేందుకు.

ఆ తలను పట్టుకున్న వ్యక్తి.. తనను తాను పరిచయం చేసుకుని.. ఇది తన తండ్రి తల అని, అతడో దేశ ద్రోహి అంటూ పేర్కొనడంతో నిర్ధారణైంది మృతుడు, కిరాతకుడు తండ్రి కొడుకులని. తండ్రిని చంపి వీడియో చేశాడు కసాయి కొడుకు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలలేని మృతదేహం గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జస్టిన్ మోహ్ అనే యువకుడు.. తన తండ్రి మైఖేల్ మెహ్ తల నరికి.. దాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి..యూట్యూబ్‌లో వీడియో పోస్టు చేశాడు. వీడియో మధ్యలో తండ్రి తలను చూపించాడు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంట్లో నుండి తల్లి డెనిస్ బయటకు వెళ్లగా.. రాత్రి 7 గంటలకు తిరిగి వచ్చేటప్పటికి తలుపులు తీసి ఉన్నాయి. భర్త కారు కనిపించలేదు.. కొడుకు కనిపించలేదు.

He killed his father as a traitor

అంతలో తల లేని భర్త మృతదేహం ఇంట్లో పడి ఉండటంతో.. వెంటనే 911 కు ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. అక్కడకు చేరుకున్న పోలీసులు బాత్రూంలో మైఖేల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనా స్థలిలో ఉన్న కూరగాయలు కోసే కత్తి, రక్తంతో తడిసి ఉన్న రబ్బరు గ్లౌజులు, పడకగదిలో ప్లాస్టిక్ బ్యాగులో ఉంచిన మైఖేల్ తలను గుర్తించారని చెప్పారు. యూట్యూబ్‌లో 14 నిమిషాల వీడియోలో తన తండ్రి దేశ ద్రోహి అని, అమెరికా తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటుందని చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్లాక్ లైవ్స్ మేటర్ మూవ్ మెంట్, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీపై మండిపడ్డాడు. లా అండ్ ఎన్ ఫోర్స్ మెంట్పై ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు దాడి చేయాలని కోరాడు. కాగా, ఈ వీడియోను యూట్యూబ్ తొలగించింది. నిందితుడ్ని ఘటనా స్థలికి 100 మైళ్ల దూరంలో గుర్తించారు పోలీసులు. అతడ్ని అదుపులోకి తీసుకుని.. హత్య, ఉద్దేశపూర్వకంగా మారణాయుధాలు కలిగి ఉండటం వంటి అభియోగాలను నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి