iDreamPost

వీడియో: స్టేషన్ లో CIకి హారతిచ్చిన దంపతులు! ఎందుకంటే!

ఓ మహిళ తన భర్త, కూతుర్లను కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కు హారతి ఇచ్చి, పూల మాల వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ మహిళ తన భర్త, కూతుర్లను కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కు హారతి ఇచ్చి, పూల మాల వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో: స్టేషన్ లో CIకి హారతిచ్చిన దంపతులు! ఎందుకంటే!

సాధారణంగా ఎవరైనా హారతి అనేది దేవుడికి ఇస్తుంటారు. అలానే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆయా వ్యక్తులకు హారతి ఇస్తుంటారు. అందుకే హారతి అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది ఇంట్లో పూజ గది, బయట దేవాలయం. అయితే ఓ ప్రాంతంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.  ఓ దంపతులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న అధికారికి హారతి ఇచ్చారు. అలా ఆ దంపతులు  ఆహరతి ఇస్తుంటే  ఆ పోలీస్ మాత్రం వద్దు అంటూ తిరష్కరించాడు. మొత్తానికి వీరి మధ్య జరిగిన హారతి సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మరి.. అసలు ఎందుకు ఆయన హారతి ఇస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అది మధ్యప్రదేశ్ లోని రేవా పట్టణంలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ లో సీఐ జేపీ పటేల్ తన గదిలో కూర్చొని ఉన్నారు. ఆ గదిలోకి అనురాధ సోని, కుల్ దీప్ సోని అనే దంపతులు తమ కూతుర్లను తీసుకొని వచ్చారు. అనురాధ చేతిలో హారతి, కుల్ దీప్ చేతిలో పూల దండ శాలువ ఉన్నాయి. సీఐ గదిలోకి వెళ్లిన అనురాధ.. జేపీ పటేల్ కు హారతి ఇవ్వబోయింది. ఆయన మాత్రం అందుకు నిరాకరిస్తూ.. ఆ హారతి పల్లెంను పక్కన పెట్టాడు. అలానే అనురాధ భర్త కుల్ దీప్ సోనీ పూల మాలను సీఐ మెడలో వెయ్యబోయారు. అలానే  ఆ దంపతులు తీసుకొచ్చిన శాలువా కూడా కప్పబోయారు. అయితే సీఐ మాత్రం అన్నిటికి వద్దు అంటూ తిరష్కరించారు. ఇదంతా వీరితో పాటు వచ్చిన మరొకరు వీడియో రికార్డు చేయడం ప్రారంభించారు. అసలు వాళ్లు అలా ఎందుకు చేశారో తెలియక తొలుత చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు విషయం తెలుసుకుని మంచి పని చేశారంటూ ఆ దంపతులను అభినందిస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి.. అసలు స్టోరి ఏమిటంటే..

అనురాధ సోని, ఆమె భర్త కుల్ దీప్ సోని బంగారు షాపును నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి లో వీరి షాపులో పని చేసే ఇద్దరు సిబ్బంది అయినా అర్పిత్ , ముకేశ్ కలిసి నాలుగు కిలో వెండిని దొంగిలించారు. ఈ చోరీ గురించి ఆ అనురాధ దంపతులు రేవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కనిపించకుండా  పోయిన నిందితులు కొన్ని రోజుల తరువాత నేరుగా హైకోర్టు ఆశ్రయించి.. బెయిల్ పొందారు. ఇక ఈ కేసుపై పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం వహించడం ఆ దంపతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో తమ నిరసన పోలీసులకు తెలియజేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ ఉన్న సీఐ జేపీ పటెల్ వద్ద ఈ విధంగా హారతి ఇస్తు తమ నిరసనను తెలియజేశారు. తమ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటంతో ఇలా చేశామని ఆ దంపతులు తెలిపారు. అయితే విధుల్లో ఉన్న తమను ఇలా అవమానించారంటూ సదరు పోలీసు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కోర్టు కూడా ఆ దంపతులపై సీరియస్ అయ్యింది. దీంతో ఆ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారూ.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి