iDreamPost

కరోనా కట్టడికి -ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ – ఏపీ ప్రభుత్వం

కరోనా కట్టడికి -ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ – ఏపీ ప్రభుత్వం

కోవిడ్ 19 నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తూ 693548 టెస్ట్లు చేసి బాధితులకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ 47.32 శాతం రికవరీతో , 1.35 శాతం 1.18 శాతం మాత్రమే మరణాలతో పాజిటివ్ గా తేలిన 9372 మందిలో 4435 మందిని ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేర్చి ఇంకా 4826 మందికి సమగ్ర వైద్యం చేస్తున్న ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో మరో గొప్ప ముందడుగు వేస్తోంది .

కోవిడ్ 19 నివారణ కోసం ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి స్క్రీనింగ్ నిర్వహించాలని , అలాగే వారి హెల్త్ రికార్డ్ పరిశీలించి దగ్గు , జలుబు , జ్వరం ఇతర కోవిడ్ లక్షణాలు ఏమైనా కనపడితే వెంటనే కరోనా టెస్ట్ నిర్వహించాలని ఆదేశించారు .

అలాగే షుగర్ , బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సైతం ఆయా వ్యాధులకు సంభందించిన పరీక్షలు చేసి తగు ఆరోగ్య సూచనలు చేసి అవసరమైన మెడిసిన్ అందించాలని సూచించారు . ఈ ప్రక్రియ రాష్ట్రమంతా మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే రానున్న వర్షాకాలం జ్వరం , ఇతర ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి మండలానికి ఒక 104 వాహనాన్ని అందించి కరోనా టెస్ట్ కోసం శాంపిల్ సేకరించే సౌకర్యం ఏర్పాటు చేయాలని , దానితో పాటు బిపి , షుగర్ ఇతర వ్యాధులకు టెస్ట్ చేయటంతో పాటు , మెడిసిన్ కూడా అందించాలని ఈ ప్రక్రియ కోసం 104 వాహనం మండలంలో ప్రతి గ్రామానికి నెలకొకసారి చొప్పున వెళ్లి ఈ తరహా సేవాలందించాలని ఆదేశించారు . ఇందుకోసం ఆయా గ్రామాలకు చెందిన ఏఎన్ఎంలు , ఆశా వర్కర్లు , వలంటీర్స్ ఒక బృందంగా ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించి ఈ సేవలను సమీక్షించాలని సూచించారు . డిప్యూటీ సీఎం ఆళ్ల నానీ , డిజిపి , చీఫ్ సెక్రటరీ పాల్గొన్న ఈ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాలు కోవిడ్19 వ్యాప్తికి భయపడుతున్న ప్రజలకు తమ ఆరోగ్య భద్రత పట్ల భరోసా కలిగిస్తున్నాయని చెప్పొచ్చు .

కోవిడ్ 19 కట్టడికి జగన్ తీసుకొన్న నిర్ణయాలు , అత్యధికంగా టెస్ట్లు చేసి వ్యాధి బారిన పడ్డవారికి సత్వరం సేవలందిస్తున్న విధానం , అందుకోసం వలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకొన్న తీరు చూసి జాతీయంగా పలు రాష్ట్రాల్లో ఆదర్శనీయుడని కితాబు అందుకొన్న జగన్ , కరోనా కారణంగా రాష్ట్రం ఆర్ధికంగా వెనకబడి నిధులు తక్కువగా ఉన్న దశలోనూ ఖర్చుకు వెరవక రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా 5 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేసి అనుమానితుల్ని గుర్తించి కరోనా టెస్ట్స్ చేసి వైద్యసేవలు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సాహసోపేత చర్య అయినా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ చర్యలు చేపట్టిన జగన్ ఖచ్చితంగా మరోసారి ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయుడు అవుతాడని చెప్పొచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి