iDreamPost

దేశంలో 28 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 28 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా ఉధృతంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 27,928 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా 881 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 6523 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1432 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 57 మంది మరణించారు.

ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక మరణాలు, అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.ఇప్పటికే మహారాష్ట్రలో 8068 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ కాగా 342 మంది మృత్యువాత పడ్డారు.

తెలుగురాష్ట్రాలలో కూడా కరోనా ఉధృతి కొనసాగుతుంది. తెలంగాణలో 1002 పాజిటివ్ కేసులు నమోదవగా, 26 మంది మృతిచెందారు. వైరస్ బారినుండి తెలంగాణలో 316 మంది కొలుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కి చేరగా, 31 మంది మృతిచెందారు.  232 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా కొత్తగా మరో 80 కేసులు నమోదయ్యాయి.

విజయవాడలో వైరస్ ఉధృతి అధికంగా ఉంది. కృష్ణా జిల్లాలో 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్క విజయవాడలోనే 150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని 10మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో ఒక ఏడీసీపీ, ఒక మహిళా ఎస్సై, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 29,95,056 మందికి కోవిడ్ 19 సోకగా,2,07,000 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 8,78,997 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 9,87322 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 55,415 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి