iDreamPost

కరోనా ఎఫెక్ట్-గోకుల్ చాట్ క్లోజ్ ..వేలమందిలో టెన్షన్

కరోనా ఎఫెక్ట్-గోకుల్ చాట్ క్లోజ్ ..వేలమందిలో టెన్షన్

హైదరాబాద్ లో చాట్ ఫుడ్ తినేవాళ్ళల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతోంది. భాగ్యనగరంలోని చాట్ ఫుడ్ అమ్మే వాటిల్లో కోటీలో ఉండే గోకుల్ చాట్ దే అగ్రస్ధానం. గోకుల్ చాట్ ఎక్కడుంటుంది అని అడిగితే జంటనగరాల్లో ఏమూలలో ఉన్న వాళ్ళనడిగినా ఇట్టే చెప్పేస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే గోకుల చాట్ లో జరిగిన బాంబు పేలుళ్ళతో జాతీయస్ధాయిలో కూడా పాపులర్ అయిపోయింది. అంతే ఫేమస్ అయిన గోకుల్ చాట్ ను అధికారులు మంగళవారం మూయించేశారు.

హఠాత్తుగా చాట్ ను అధికారులు ఎందుకు మూయించేశారు ? ఎందుకంటే కరోనా వైరస్సే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోకుల్ చాట్ యజమానికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో యజమానిని వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. యజమానితో పాటు అందులో పనిచేసే 20 మంది సిబ్బందిని కూడా అధికారులు పరీక్షలకు తరలించారు. ఎప్పుడైతే చాట్ యజమానికి వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యిందో వేలాది మందిలో టెన్షన్ ఒక్కసారిగి పెరిగిపోతోంది.

గోకుల్ చాట్ కున్న పాపులారిటి వల్ల ప్రతిరోజు ఇక్కడ కొన్ని వేలమంది చాట్ తినేందుకు వస్తారు. ఉదయం మొదలయ్యే గోకుల్ చాట్ రాత్రి 11 గంటల వరకూ బిజీగానే ఉంటుంది. యజమానికి ఎప్పుడు వైరస్ సోకిందో తెలీదు కానీ రోజూ వచ్చి కౌంటర్లో కూర్చుంటున్న విషయం వాస్తవం. దాంతో యజమానికి ఆయన్ను నుండి సిబ్బందికి వాళ్ళనుండి చాట్ తినేందుకు వచ్చిన వాళ్ళకు వైరస్ సోకి ఉంటుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో సుమారుగా 5200 కేసులున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి