iDreamPost

‘ఖుషి’ మూవీపై కాపీ ట్రోల్స్! డైరెక్టర్ స్పందిస్తూ ఏమన్నాడంటే..

  • Author ajaykrishna Updated - 11:08 AM, Sat - 12 August 23
  • Author ajaykrishna Updated - 11:08 AM, Sat - 12 August 23
‘ఖుషి’ మూవీపై కాపీ ట్రోల్స్! డైరెక్టర్ స్పందిస్తూ ఏమన్నాడంటే..

చిత్రపరిశ్రమలో సినిమాలు, సాంగ్స్.. సన్నివేశాలు ఇలా ఒకదాన్ని పోలి ఒకటి కనిపిస్తే చాలు వెంటనే కాపీ ట్రోల్స్ మొదలైపోతాయి. ఫలానా సీన్ ఆ సినిమాలోది అని.. ఫలానా సినిమా స్టోరీని పోలి ఉందని సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో ఆరోపణలు చేసేస్తుంటారు. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ లకు కూడా ఈ మధ్యకాలంలో కాపీ ట్రోల్స్ తప్పట్లేదు. తాజాగా అలాంటి కాపీ ట్రోల్స్ నే ఫేస్ చేస్తోంది ఖుషి ట్రైలర్. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కించాడు. రొమాంటిక్ లవ్ డ్రామా జానర్ రూపొందిన ఈ సినిమా నుండి ఇటీవల ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 1న ఖుషి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది.

ఇక ఖుషి ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఆల్రెడీ హేషమ్ అబ్దుల్ అందించిన సాంగ్స్ అన్ని సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే.. ట్రైలర్ అంతా బాగానే ఉంది. విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. కానీ.. స్టోరీ పరంగా ఖుషి.. మణిరత్నం తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ ‘సఖి’ సినిమాను పోలి ఉందని… కాపీ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. సఖి సినిమాకు అన్ ఆఫీషియల్ రీమేక్ లా ఉందంటూ నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే.. ఖుషి ట్రైలర్ లో సఖి పోలికలు నిజంగా కనిపిస్తున్నాయి.. కొన్ని షాట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయని అంటున్నారు. కానీ.. సినిమాలో కాలేజీ బ్యాక్గ్రౌండ్ మార్చేసి కాశ్మీర్ గా మార్చినట్లు చెప్పుకుంటున్నారు.

ట్రైలర్ లో గమనిస్తే.. కాశ్మీర్ లో సమంతని చూసి విజయ్ ప్రేమలో పడగా.. ఆమె బ్రాహ్మిన్స్.. విజయ్ క్రిస్టియన్. వీరి పెళ్లికి ఫ్యామిలీలో ఒప్పుకోరు. కట్ చేస్తే.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొని సపరేట్ గా కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. కానీ.. కొన్నాళ్ళకు మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లెమ్స్ స్టార్ట్ అవుతాయి. సఖీ లైన్ కూడా ఇదే. కొన్ని షాట్స్ కూడా సేమ్ ఉన్నాయని ట్రోల్ చేస్తున్నారు. అయితే.. కాపీ ట్రోల్స్ పై డైరెక్టర్ శివ రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. “ప్రేమ, పెళ్లి కథలలో అవి రెండు కామన్ గా ఉంటాయి. లవ్ అన్నాక లవ్.. మ్యారేజ్ అన్నాక మ్యారేజ్ చూపించాలి. కానీ.. బోరింగ్ డైలాగ్స్, డ్రామా లేకుండా ఆడియన్స్ ను హుక్ చేసి ఉంచడమే ముఖ్యం” అని చెప్పాడట శివ. ప్రస్తుతం ఖుషి కాపీ ట్రోల్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఖుషి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి