iDreamPost

KCRపై పోటీకి ఎందుకు ఇంత ఉత్సాహం! నేతల మాస్టర్ ప్లాన్!

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల సందడి మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుట ఎగురవేసేందుకు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి.

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల సందడి మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుట ఎగురవేసేందుకు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి.

KCRపై పోటీకి ఎందుకు ఇంత ఉత్సాహం! నేతల మాస్టర్ ప్లాన్!

తెలంగాణలో ఎన్నికల హడావుడి రసవత్తరంగా మారుతుంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగానే అధికార పార్టీ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. స్వయంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ములుగు నుంచి బస్సు యాత్ర తో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రచారం షురు చేయలేదు.. కాకపోతే రేపు సూర్యాపేట నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలను ప్రతిపక్షాలు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలిచారు. అంతేకాదు బీఆర్ఎస్ తరుపు నుంచి పోటీ చేసిన అభ్యర్థులు రెండుసార్లు గెలిచారు. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకే ప్రధాన్యత ఇచ్చారు కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణ లో బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు గట్టి పట్టుమీదే ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ని టార్గెట్ చేసుకొని ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు కేసీఆర్ ని టార్గెట్ చేసుకోవడం వెనుక భారీ వ్యూహమే ఉందని అంటున్నారు.

గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి సీఎం రేసులో పోటీ బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రిగా పదవికి తాము అర్హులుగా రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సి. దామోదర్ రాజనర్సింహ, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు ఈ మద్యనే జగ్గారెడ్డి సైతం తనకు సీఎం పదవి దక్కే అవకాశం ఉందని బహిరంగంగానే చెప్పారు. ఇక బీజేపీ నుంచి సీఎం రేసులో ఉన్నవాళ్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణ,డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్ లాంటి కీలక నేతలు ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ని ఢీ కొట్టగల సమర్థవంతమైన అభ్యర్థులు ఎవరు అన్నది ఆయనపై పోటీ చేసి గెలిస్తేనే తేలిపోతుంది.

సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ గజ్వేల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో కీలక నేతలు కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలను టార్గెట్ చేసుకొని అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రెండు సార్లు ప్రత్యర్థి పార్టీ నేతలపై గెలిచిన సీఎం కేసీఆర్ నీ ఢీ కొట్టి గెలిస్తే తాము సీఎం రేసులో నిలబడేందుకు అర్హత సంపాదించినట్లుగా భావిస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ పై గెలిస్తే.. తెలంగాణ ప్రజల్లో కూడా తమ ఇమేజ్ బాగా పెరిగిపోతుందని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ నుంచి కీలక నేతలు సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసి ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి