iDreamPost

పేర్ని నానికి ఆహారాన్ని తినిపించిన కానిస్టేబుల్..

పేర్ని నానికి ఆహారాన్ని తినిపించిన కానిస్టేబుల్..

ఉమ్మడి సమస్యపై చేసే పోరాటానికి మనుషుల్లో హోదాలు అడ్డురావని మరోసారి రుజువు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మచిలీపట్నంలోని రెడ్ జోన్ ఏరియాలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. మచిలీపట్నంలో ఉన్న సమస్యలను తెలుసుకున్న పేర్ని నాని మునిసిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మచిలీపట్నంలో కరోనా సోకి ఒకరు మరణించిన కారణంగా మచిలీపట్నం ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే..

కాగా దేశంలో కరోనా వ్యాపించకుండా ప్రధాన మంత్రి మోడీ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. అప్పటినుండి పోలీసులు రేయింబవళ్లు ప్రజలకు సేవ చేస్తూ కరోనా విధుల్లో కొనసాగుతున్నారు.. అయితే కరోనా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఒకరు,మంత్రి పేర్ని నాని మచిలీపట్నం రెడ్ జోన్ ఏరియాలో పర్యటిస్తున్న వేళలో ఆత్మీయంగా ఆహారం తినిపించారు.

కరోనాపై చేస్తున్న పోరులో కలిసిన ఒక మంత్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ హద్దులు మరిచి, తమకున్న స్థాయి భేదాలను పక్కనబెట్టి, ఆత్మీయంగా ఆహారాన్ని తినిపించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఉమ్మడి పోరులో మిత్రులే తప్ప శత్రువులు ఉండరని, స్థాయి భేదాలు, మనుషుల్లో హద్దులు ఉండవన్న విషయానికి ఉదాహరణగా పేర్ని నాని, కానిస్టేబుల్ ఉదంతం నిలుస్తుంది..

కాగా రాష్ట్రంలో నమోదైన కరోనా  కేసుల సంఖ్య 329 కి చేరింది. దేశంలో 5194 మందికి కరోనా సోకగా, 149 మంది మరణించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 14 న లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు లేవని ప్రధాని మోడీ సూచాయగా వెల్లడించారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి