iDreamPost

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. జన్వాడలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌పై డ్రోన్‌ కెమెరా వాడిన కేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.గతంలో ఈ కేసుకు సంబంధించి సెక్షన్‌ 184, 187, 11 రెడ్‌ విత్‌ 5ఏ, రెడ్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద రేవంత్‌రెడ్డితోసహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసారు. రేవంత్ రెడ్డిని ఎయిర్‌పోర్ట్‌ లో అరెస్ట్ చేయడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.అనంతరం పోలీసులు రేవంత్‌రెడ్డిని గొల్కొండలోని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం రాజేంద్ర నగర్ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచారు. రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాల మేరకే వీరు డ్రోన్‌ ను కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఎగరవేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసారని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి