iDreamPost

కామారెడ్డిలో KCR ఢీకొట్టడానికి కాంగ్రెస్ భారీ వ్యూహం!

తెలంగాణలో  ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంది. అయితే మరోవైపు కాంగ్రెస్ సైతం తొలి జాబితాను విడుదల చేసింది. బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను ఢీ కొట్టడం కోసం  కాంగ్రెస్ భారీ వ్యూహం రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తెలంగాణలో  ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంది. అయితే మరోవైపు కాంగ్రెస్ సైతం తొలి జాబితాను విడుదల చేసింది. బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను ఢీ కొట్టడం కోసం  కాంగ్రెస్ భారీ వ్యూహం రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

కామారెడ్డిలో KCR ఢీకొట్టడానికి కాంగ్రెస్ భారీ వ్యూహం!

తెలంగాణలో  ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంది. అయితే మరోవైపు కాంగ్రెస్ సైతం తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇందులో కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకుల పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలా ప్రకటించిన ప్రముఖల నియోజవర్గాల లిస్ట్ లో కామారెడ్డి ఒకటి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఆయనను ఢీ కొట్టడం కోసం  కాంగ్రెస్ భారీ వ్యూహం రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈసారి ఎలాగైన అధికారంలోకి రావాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు తగ్గట్లే అభ్యర్థులను విడతల వారిగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమలో మొదటి జాబితాగా 55నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ జాబితాలో అందరూ ఊహించిన కామారెడ్డి పేరు లేకపోవడంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ లో సీనియర్ నేత మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన షబ్బీర్ అలీ పేరు తొలి జాబితాలో లేకపోవడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలి నాళ్ల నుంచి కామారెడ్డి అంటే  షబ్బీర్ అలీ… షబ్బీర్ అలీ అంటే కామారెడ్డి అని చెబుతుంది కాంగ్రెస్. కానీ పార్టీ విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడం ఏంటో ఆ పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదంట.  దీని బట్టి  చూస్తే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి విషయంలో కాంగ్రెస్ పరంగా సంచలన నిర్ణయాలు ఉంటాయని అనుమానలు వ్యక్తమవుతున్నాయి.

గజ్వేల్, కామారెడ్డి నియోజవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటెల రాజేందర్  పోటీ చేస్తానని చెప్పారు.  ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నర్సారెడ్డి కూడా బలమైన నాయకుడే.  ఈ నేపథ్యంలోనే కామారెడ్డి విషయంలో కాంగ్రెస్ చాలా గట్టి వ్యూహమే రచిస్తున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో కూడా కేసీఆర్ పై పోటీ చేసే అభ్యర్థి కోసం కొత్తగా ఆలోచిస్తున్నట్లు పోలిటికల్ టాక్ వినిపిస్తోంది. జహిరాబాద్ నుంచి గతంలో పోటీ చేసిన మదన్ మోహన్ రావును బరిలో దించే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని టాక్. కేసీఆర్, మదన్ మోహన్ రావు ఇద్దరు ఒకే సామాజకవర్గం అనే కోణంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే పోటీ చేయించాలనే యోచనలో  ఉన్నారని కాంగ్రెస్ లోని కొందరి వద్ద వినిపిస్తోన్న మాట.  దీని బట్టి చూస్తే కేసీఆర్ ని రెండు నియోజకవర్గాల్లో కట్టడి చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక వేళ రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తే మాత్రం గెలుపోటములు ఎలా ఉన్నా.. పోటీ మాత్రం యుద్ధాన్ని తలపిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అలానే మాజీ మంత్ర షబ్బీర్ అలీ కి కామారెడ్డిలో మంచి ఇమేజ్ ఉంది.

అలానే రెండు సార్లు ఓడిపోయారనే సానుభూతి ఉంది. ఈ క్రమంలోనే కేసీఆర్ కి పోటీగా వేరేవరు కాకుండా షబ్బీర్ అలీ ఉంటేనే మేలనే ఆలోచన కూడా కాంగ్రెస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఒకవైపు చర్చ నడుస్తుంటే..షబ్బీర్ అలీ మాత్రం సమన్వయంగా  ఉంటూ ప్రజల్లో తిరుగుతూ తన పని తాను చేసుకెళ్తున్నారు. మరి.. ఇలా కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తునప్పటికి అధినాయకత్వం మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి