iDreamPost
android-app
ios-app

దీపావళి ముందు జనాలకు షాక్‌.. భారీగా పెరిగిన గ్యాస్‌ ధర

  • Published Nov 01, 2023 | 10:54 AMUpdated Nov 01, 2023 | 10:54 AM

పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతుంది. ఇప్పటికే ఉల్లి ధర భగ్గున మండి పోతుంది. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం గ్యాస్‌ ధర భారీగా పెరిగింది. ఆ వివరాలు..

పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతుంది. ఇప్పటికే ఉల్లి ధర భగ్గున మండి పోతుంది. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం గ్యాస్‌ ధర భారీగా పెరిగింది. ఆ వివరాలు..

  • Published Nov 01, 2023 | 10:54 AMUpdated Nov 01, 2023 | 10:54 AM
దీపావళి ముందు జనాలకు షాక్‌.. భారీగా పెరిగిన గ్యాస్‌ ధర

ఎన్నికల సమయం కావడంతో.. దాదాపుగా అన్ని చోట్ల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్‌ ధరల మీద భారీ రాయితీలు ప్రకటించాయి. ఇక ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అయితే దీపావళి సందర్భంగా ప్రజలకు ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా ఇస్తానని ప్రకటించింది. ఇక తెలంగాణలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు తమను గెలిపిస్తే.. గ్యాస్‌ ధరలను భారీగా తగ్గిస్తామని హామీ ఇచ్చాయి.

ఇదిలా ఉంటే ఇక ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్‌ ధరలను పెంచడం, తగ్గించడం చేస్తాయి. నేడు నవంబర్‌ 1 కావడంతో.. చమురు కంపెనీలు గ్యాస్‌ ధరలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నాయి. దీపావళి పండగ ముందు జనాలకు భారీ షాక్‌ ఇస్తూ.. గ్యాస్‌ ధరను పెంచాయి. ఆ వివరాలు..

నవంబర్‌ నెల ప్రారంభం రోజునే బ్యాడ్‌ న్యూస్‌ వినాల్సి వచ్చింది. ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అమాంతం పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 100 చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఇది నవంబర్ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపాయి. దేశంలో గత రెండు నెలలుగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుతూనే ఉంది. అయితే కేంద్రం నిర్ణయం కారణంగా గృహ వినియోగ వంట గ్యాస్‌ రేటు మాత్రం గత రెండు నెలలుగా స్థిరంగా ఉంది. ఇది సామాన్యులకు కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు.

పెరిగిన ధరల తర్వాత నేడు దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1833కు చేరింది. కోల్‌కతాలో ఇది రూ. 1943 వద్ద ఉండగా.. ముంబయిలో రూ.1785 కు చేరింది. చెన్నైలో రూ. 1999.50, బెంగళూరులో రూ.1914.50 వద్ద ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 2053.50 వద్ద కొనసాగుతోంది. కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంపు వల్ల హోటల్స్‌, టిఫిన్‌ సెంటర్లు, తోపుడు బళ్ల మీద చిరుతిళ్ల వ్యాపారం చేసుకునేవారు ఇబ్బంది పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి