iDreamPost

వీడియో: కమెడియన్ యాదమ్మ రాజుకు ప్రమాదం.. ఆస్పత్రి బెడ్ పై..!

వీడియో: కమెడియన్ యాదమ్మ రాజుకు ప్రమాదం.. ఆస్పత్రి బెడ్ పై..!

పటాస్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు యాదమ్మరాజు ఎంతగానో దగ్గరయ్యాడు. ఆ తర్వాత బుల్లితెరలోనే పలు కామెడీ షోస్ నటిస్తూ ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అటు ఆన్ స్క్రీన్ మీదే కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా యాదమ్మ రాజు ఫుల్ జోష్ లో ఉంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి స్టెల్లాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.

యాదమ్మ రాజు- స్టెల్లా చేసే అల్లరి చూసి ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతారు. కానీ, ఇప్పుడు యాదమ్మరాజు- స్టెల్లా ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు. ఎందుకంటే తాజాగా స్టెల్లా రాజు ఒక వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో యాదమ్మ రాజు ఆస్పత్రి బెడ్ పై ఉన్నాడు. కుడి కాలికి కట్టు కూడా ఉంది. బెడ్ మీద నుంచి దిగేందుకు యాదమ్మరాజు ప్రయత్నించగా.. పక్కనే ఉండి స్టెల్లా సహాయం చేస్తూ ఉంది. ఆ వీడియోకి ‘గెట్ వెల్ సూన్ బేబీ అయామ్ దేర్ ఫర్ యూ’ అంటూ స్టెల్లా రాజ్ కొటేషన్ పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by RAJU VANKUDOTH (@yadamma_raju)

సడెన్ గా యాదమ్మ రాజుని ఈ స్థితిలో చూసి అతని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. నెటిజన్స్ కూడా షాకవుతున్నారు. యాదమ్మ రాజుకు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంట్లో ఏమైనా కాలు జారి పడ్డాడా? ఏదైనా ప్రమాదం జరిగిందా? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. అయితే వారి యూట్యూబ్ ఛానల్ లో ఏమైనా వీడియో ద్వారా వెల్లడిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. యాదమ్మ రాజు- స్టెల్లా అభిమానులు మాత్రం గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by sharon stella pastham (@stellaraj_777)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి