iDreamPost

కల్నల్ సంతోష్ బాబు విగ్రహం సిద్ధం…

కల్నల్ సంతోష్ బాబు విగ్రహం సిద్ధం…

దేశ రక్షణ కోసం చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంది.

వివరాల్లోకి వెళితే దేశ రక్షణ కోసం వీర మరణం పొందిన సంతోష్ బాబు గౌరవార్థం ఆయన స్వస్థలమైన సూర్యాపేట పాత బస్టాండ్‌ కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సంతోష్ బాబు విగ్రహం దాదాపుగా సిద్ధం చేశారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శిల్పులు. ఇప్పుడు సంతోష్ బాబు విగ్రహం చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గల్వాన్‌ లోయ వద్ద మన సైనికులకు చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనాకు చెందిన కమాండర్ సహా 40 మంది సైనికులు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన కుటుంబానికి ఐదుకోట్ల ఆర్థిక సహాయంతో పాటు, సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1స్థాయి ఉద్యోగం మరియు ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఆయన విగ్రహ ఏర్పాట్లు సూర్యాపేటలో కొనసాగుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి