iDreamPost

ఏపీ ‘సీఎంఓ’లో అధికారులకు శాఖల కేటాయింపు

ఏపీ ‘సీఎంఓ’లో అధికారులకు శాఖల కేటాయింపు

సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన కేఎస్ జవహర్ రెడ్డి సీఎం కార్యాలయంలో ఉన్న అధికారులకు శాఖలు కేటాయిస్తూ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. తన పరిధిలో జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ సబ్జెక్టులను ఉంచుకున్నారు కేఎస్ జవహర్‌రెడ్డి.

అలాగే సీఎం కార్యదర్శి సాల్మన్ రాజ్‌కు పౌరసరఫరాలు, విద్యా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయించారు. సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంథన, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు కేటాయించారు. సీఎం అడిషనల్ సెక్రటరీ ముత్యాల రాజుకు ప్రజా ప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్),హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్మెంట్ శాఖలను కేటాయించినట్టు కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి