iDreamPost

ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు .. ప్రగతి పథంలో ఆర్టీసీ!

ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు .. ప్రగతి పథంలో ఆర్టీసీ!

ఆర్టీసీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ప్రజా రవాణలో ఈ వ్యవస్థదే కీలక పాత్ర. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలకు  రవాణ సేవలు అందిస్తుంది. దానిని ఎంత నూతనంగా తీర్చిదిద్దితే అంతగా ప్రజలకు మెరుగైన సేవల అందిస్తుంది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  గుర్తించి.. ఆర్టీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా ఆ సంస్థ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలతో అప్పుల్లో ఉన్న ఆర్టీసీ.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.

దీంతో కరోనా  కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులను అధికమించి ఏపీఎస్ ఆర్టీసీని ప్రగతి పథంలో ముందుకెళ్తోంది. ఆర్టీసీ రాబడి 17 శాతం పెరగడమే దీనికి నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం కంటే జగన్ హాయంలో ఆర్టీసీ ప్రగతి బాట పట్టింది. కోవిడ్ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల  మాదిరిగానే ఏపీఎస్ ఆర్టీసీ కూడా  రెండేళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. అయితే జగన్ సర్కార్ తీసుకున్న చర్యలు, నిర్ణయాలను కారణంగా కానీ మళ్లీ వెంటనే గాడిన పడింది.

మెరుగైన ఫలితాలను సాధిస్తో ఆక్యూపెన్సీ రేటును పెంచుకుంది. ఆర్టీసీ సాధిస్తోన్న రాబడి  గణాంకాలే ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఆర్టీసీకి రూ.4,781 కోట్ల రాబడి వచ్చింది. అలానే రెండో ఏడాదైన 2022–23లో రూ.5,574 కోట్ల రాబడి సాధించింది. ఇదే ఏడాది  కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించింది. అలాంటి కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా తొలి ఏడాది కంటే కూడా రెండో ఏడాది రూ.793 కోట్లు అధికం రాబడి సాధించింది. అంటే  17 శాతం అధిక రాబడిని సాధించింది. 2019–20లో కి.మీ రాబడి రూ.31.31 ఉండగా.. 2022–23లో రూ.37.91కు పెరిగింది. అంటే కిలోమీటర్‌కు రూ. 6.60 అధికంగా సాధించింది.

దశాబ్దాలుగా ఆర్టీసీ  దసరా, సంక్రాంతి పండుగలకు అధిక చార్జీలు వసూలు చేసేది. ప్రస్తుతం ఎటువంటి అదనపు  ఛార్జీలు లేకుండా  సాధారణ ఛార్జీలతోనే సర్వీసులు నిర్వహిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఆ సంస్థ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. ఈ మూడేళ్లలో తీర్చిన అప్పులే అందుకు నిదర్శనం. అలానే బ్యాంకులు, సీసీఎస్ బకాయిలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన నగదు వంటివి ఆర్టీసీ తీర్చింది. ఇలా అప్పులు తగ్గి..  ఆదాయం పెరిగింది. మరి.. ఈ ఆర్టీసీ సాధిస్తోన్న  ప్రగతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి