iDreamPost

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. పల్నాడు జిల్లాలో 12వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-12: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర బుధవారం 12వ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-12: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర బుధవారం 12వ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. పల్నాడు జిల్లాలో 12వ రోజు హైలెట్స్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించి ప్రజల్లోకి సాగుతున్నారు. సీఎం జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ కి ప్రజలు నీరాజనాలు పలికారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ బస్సు యాత్ర పూర్తైంది. బుధవారం 12వ రోజు పల్నాడు జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగింది. మరి.. 12వ రోజు పల్నాడు జిల్లాలో జరిగిన మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర బుధవారం 12వ రోజూ  పల్నాడు జిల్లాలో కొనసాగింది. బుధవారం ఉదయం 9 గంటలకు గంటావారి పాలెం నుంచి  సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభమైంది.  ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ కు చెందిన  పలువురు నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.  విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నుంచి పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. ఇక ఈ బస్సుయాత్ర పుట్టవారి పాలెం, సంతమాగులూరు క్రాస్ , రొంపిచర్ల మీదుగా అయ్యప్ప నగర్ వరకు సాగింది. అనంతరం కొండుమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా అయ్యప్ప నగర్ బైపాస్ కు చేరకొంది. అక్కడ నిర్వహించిన మేమంతా సిద్దం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అనంతరం  కొండమోడు జంక్షన్ ,అనుపాలెం, రెడ్డి గూడెం మీదుగా ధూళిపాళ్లకు చేరుకుంటారు.

ఇక పల్నాడు జిల్లాలో సాగిన సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. సీఎం జగన్  కు దారిపొడవునా పూలవర్షం కురిపించారు. సీఎం జగన్ అంటూ ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రజల సమస్యలు ఉంటూ,  వాటికి పరిష్కారం చూపుతూ ముందుకు  కదిలారు. పలు గ్రామాల్లో సీఎం జగన్ కి భారీ గజమాలతో ప్రజలు స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో సీఎం వైఎస్ జగన్ కి మహిళలు దిష్టి తీశారు.   ఇక పల్నాడు జిల్లాలో సాగిన సీఎం జగన్ బస్సుయాత్రలో సంక్షేమ పథకాలు, వివిధ రకాలుగా సాయం పొందిన వారు సీఎం జగన్ ను కలిసి..తమ కృతజ్ఞతలు తెలియజేశారు. పలు గ్రామాల్లోని ప్రజలు సీఎం జగన్ కు పూలు చల్లుతూ, గజమాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఇలా 12వ రోజు సీఎం జగన్ బస్సుయాత్ర పల్నాడు జిల్లాలో విజయవంతంగా సాగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి