iDreamPost

మరో కొత్త పథకం ప్రారంభించిన సీఎం జగన్‌.. వారికి గుడ్‌ న్యూస్‌

మరో కొత్త పథకం ప్రారంభించిన సీఎం జగన్‌.. వారికి గుడ్‌ న్యూస్‌

ప్రజల అభివృద్ధే.. రాష్ట్ర అభివృద్ధి అనేలా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్‌ పాలన సాగిస్తోంది. స్పల్ప విరామంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ విజయవంతంగా అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరో కొత్త పథకం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వర్గాల వారి కోసం సరికొత్త పారిశ్రామిక విధానాన్ని సీఎం జగన్‌ ప్రవేశపెట్టారు.

జగనన్న – వైఎస్సార్‌ బడుగు వికాసం పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గరిష్టంగా కోటి రూపాయల పోత్స్రాహకం ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం నుంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఉద్దేశించినదే ఈ పథకం అని ప్రారంభించని తర్వాత వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, క్వాలిటీ సర్టిఫికెట్, పేటెంట్‌ రుసుముల్లో కోటి రూపాయల మేర రాయితీలు ఇవ్వనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పన భూములు కేటాయించనున్నట్లు ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి