iDreamPost

వైఎస్‌ జగన్‌ దూకుడు.. పథకాల అమలుకు మరో క్యాలెండర్‌ ప్రకటన

వైఎస్‌ జగన్‌ దూకుడు.. పథకాల అమలుకు మరో క్యాలెండర్‌ ప్రకటన

సంకల్పంతో విజయం సిద్ధిస్తుందంటారు. ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా గట్టి సంకల్పం పట్టినట్టున్నారు. తాను ఇచ్చిన హామీల అమలు వాయిదా వేసేందుకు కరోనా వల్ల ఏర్పడి ఆర్థిక ఇబ్బందుల రూపంలో అనేక కారణాలు ఉన్నా ఆ దిశగా ఆలోచించకుండా ప్రజా నాయకుడుగా ప్రజల వృదయాల్లో నిలిపోతున్నారు. గత ప్రభుత్వంలో పాలకులు బీద ఆరుపులు, బేల మాటలు మాట్లాడని రోజు లేదంటే అతిశయోక్తికాదు. కానీ నేడు ఇలాంటి మాటలకు తావులేదు. చెప్పిన మాట.. తప్పకుండా అమలు చేయాలనే లక్ష్యం తప్పా.. కారణాలు చూపుతూ ప్రజలను వంచించే ఆలోచనే నేటి పాలకులు చేయడం లేదు.

కోవిడ్‌ వల్ల ప్రపంచం అంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఏపీలో మాత్రం వైఎస్‌ జగన్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. కొత్త పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్‌ను ప్రకటించారు. రెండు నెలల కాలంలో ఏ ఏ పథకాలు ఎప్పుడు అమలు చేయబోతున్నామన్నది సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

ఏ పథకం ఎప్పుడు అమలు..

– వైఎస్సార్‌ బీమా పథకం: అక్టోబర్‌ 21

– వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత : అక్టోబర్‌ 27

– జగనన్న తోడు : నవంబర్‌ 6

– రైతులకు సున్నా వడ్డీ రుణాలు : నవంబర్‌ 10

– ఆరోగ్యశ్రీ పథకం 2వేల వ్యాధులకు మిగిలిన ఆరు జిల్లాలకు వర్తింపు : నవంబర్‌ 13

– జగనన్న వసతి దీవెన : నవంబర్‌ 17

Read Also; బడికి సరి–బేసి విధానం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి