iDreamPost

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభకు అస్వస్థత

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభకు అస్వస్థత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గుర్యయారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి నుంచి జ్వరం, ఒళ్లు నొప్పుల బాధ పడుతుండటంతో ఆస్పత్రికి చేరాల్సిందిగా సీనియర్ జనరల్ ఫిజీషియన్ డా.ఎంవీ రావు సూచించారు. సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లి.. శోభ గారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.  అంతేకాక వైద్యులను కలిసిన కేసీఆర్.. ఆయన సతీమణి శోభ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. శోభకు డాక్టర్లు.. వివిధ వైద్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సీఎం కేసీఆర్ సతీమణి శోభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్న.. వివిధ కార్యక్రమాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. అంతేకాక పూజ కార్యక్రమాల్లో కూడా శోభ పాల్గొంటూ అరుదా వార్తల్లో కనిపిస్తుంటారు. గతంలో కూడా శోభ గారు అనారోగ్యానికి గురయ్యారు.  కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్ కుటుబం సభ్యులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆమెను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అంతేకాక శోభ గారు అస్వస్థకు గురయ్యారనే విషయం తెలిసి.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.  ఆ తరువాత ఆమె ఆరోగ్యంతోగానే ఉంటూ వస్తుంది. గురువారం మరోసారి అస్వస్థకు గురయ్యారు.  జ్వరం, ఒళ్లు నొప్పుల బాధతో పడుతుండటంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి