iDreamPost

తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పింది ‘బతుకమ్మ’ : సీఎం కేసీఆర్

తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పింది ‘బతుకమ్మ’ : సీఎం కేసీఆర్

మన దేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో వారి సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రకారం ప్రత్యేకమైన రీతిలో పండుగలు జరుపుకుంటారు. అలాంటి సంప్రదాయ పండుగనే తెలంగాణ బతుకమ్మ. ప్రకృతిని ఆరాధిస్తూ.. పూలనే దేవతగా కొలిచే గొప్ప సాంప్రదాయం తెలంగాణలో అనాధిగా కొనసాగుతూ వస్తుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా చాటి చెబుతూ.. విశ్వ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పండగ బతుకమ్మ. తెలంగాణలో ఎన్ని పండుగలు ఉన్నా.. వాటిలో బతుకమ్మ పండుగ చాలా ప్రత్యేకం. వాడ వాడలా రంగు రంగు పులతో, మహిళలు చక్కటి వస్త్రాలంకరణతో, భక్తి ప్రపత్తులతో జరుపుకునే పండుగ బతుకమ్మ. మహిళలు చుట్టూ తిరుగుతూ.. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాట పాడుతు సందడి చేస్తారు. నేటి నుంచి బతుకమ్మ పండుగ మొదలు అవుతుంది.. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజలు ఎంతో సంప్రదాయంగా జరుపుకునే పండుగల్లో ఒకటి బతుకమ్మ. మహిళలు ఎంతో భక్తి ప్రపత్తులతో పూలను అలంకరించి బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. శనివారం నుంచి బతుకమ్మ (ఎంగిలిపూల బతుకమ్మ) పండుగ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి, సాంప్రదాయం మన తెలంగాణకే దక్కింది, తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది అని అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ ఎంతో గర్వంగా ఉంది. ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ.. ముగింపు రోజు సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు ప్రకృతిలో దొరికే రక రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, తెలంగాణ ఆడపడుచులు అంతా ఆటా పాటలతో గౌరీదేవిని పూజిస్తూ సందడిగా కలిసి కట్టుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో‌నే కాదు.. బతుకమ్మ పండుగ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వారు ఆయా దేశాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయల ఔన్నత్యం గురించి చాటి చెప్పే బతుకమ్మ పండుగ విశ్వ వ్యాప్తంగా చాటుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా కొలుచుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని సీఎం కేసీఆర్ అన్నారు. మహిళా సంక్షేమాభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేసింది. మహిళా సాధికారతను పెంపొందిస్తూ.. దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ప్రజల బతుకుల్లో కొత్త వెలుగులు నింపుతూ.. సుఖ సంతోషాలతో.. ఆనందంగా జీవించేలా ప్రకృతి మాతను కొలిచారు సీఎం కేసీఆర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి