iDreamPost

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో ఆసరా పింఛన్ల పెంపు!

  • Author Soma Sekhar Published - 09:13 AM, Mon - 21 August 23
  • Author Soma Sekhar Published - 09:13 AM, Mon - 21 August 23
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో ఆసరా పింఛన్ల పెంపు!

సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. అందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుని.. ముందడుగు వేసింది కేసీఆర్ సర్కార్. ఆదివారం సూర్యాపేటలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆసరా పింఛన్లను పెంచుతాం అని కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు. దీంతో ఆసరా పింఛన్ లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పింఛన్ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపింది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

‘త్వరలోనే ఆసరా పింఛన్లను పెంచుతాం’ ఆదివారం సూర్యాపేటలో జరిగిన భహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయా వర్గాల లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆసరా పథకంలో భాగంగా ఇప్పటికే దివ్యాంగులకు రూ. 3,016 ఉన్న పింఛన్ ను గత రూ. 4,016కు పెంచిన విషయం తెలిసిందే. దీంతో తమకూ పెంచాలని ఇతర ఆసరా ఫించన్లు అందుకుంటున్న వారి నుంచి విన్నపాలు అందాయి. ఈ విన్నపాలపై సానుకూలంగా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం.

ఇక ప్రస్తుతం వివిధ విభాగాలకు చెందిన లబ్దిదారులకు ప్రభుత్వం రూ. 2,016 పింఛను ఇస్తోంది. వీరికి సైతం దివ్యాంగులకు పెంచినట్లుగా వెయ్యి రూపాయాలను పెంచి.. రూ. 3,016 ఇచ్చేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసి ఆర్థిక శాఖకు పంపింది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెదం తెలపగానే.. ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆసరా పింఛన్ ను వెయ్యి రూపాయాలు పెంచితే.. ప్రభుత్వ ఖజానాపై మరో రూ. 450 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.

ఇదికూడా చదవండి: మిద్దెలపై చేపల పెంపకం.. లక్షలు సంపాదిస్తున్న మహిళలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి