iDreamPost

విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. నష్టపరిహారంపై ప్రకటన

  • Published Nov 06, 2023 | 12:57 PMUpdated Nov 06, 2023 | 12:57 PM

సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. దీనిపై ఏపీ సీఎం జగన్‌ స్పందించారు.. నష్ట పరిహారం ప్రకటించారు. ఆ వివరాలు..

సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. దీనిపై ఏపీ సీఎం జగన్‌ స్పందించారు.. నష్ట పరిహారం ప్రకటించారు. ఆ వివరాలు..

  • Published Nov 06, 2023 | 12:57 PMUpdated Nov 06, 2023 | 12:57 PM
విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. నష్టపరిహారంపై ప్రకటన

విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్లాట్‌ఫామ్‌ మీద ఉన్న ప్రయాణికులు మీదకు ఒక్కసారిగా బస్‌ దూసుకురావడంతో.. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నాడు. రివర్స్‌ గేర్‌ బదులు ఫస్ట్ గేర్‌ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. 24 గంటల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.5లక్షల పరిహారం అందజేస్తామని వెల్లడించారు. ఇక గాయపడ్డ వారి చికిత్స ఖర్చును ఆర్టీసీనే భరిస్తుందని తెలిపారు ద్వారకా తిరుమలరావు.

ఇక విజయవాడ బస్టాండ్‌లో జరిగిన దారుణ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. దీనిపై త్వరతగతిన.. పూర్తి స్థాయిలో విచారణ చెపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు.

సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన బస్సు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. బస్సు కిందపడి మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. ముందుగా ప్రమాదానికి కారణం బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యిందని భావించారు. కానీ , ఆ తర్వాత డ్రైవర్ రివర్స్ గేర్‌కు బదులు ఫస్ట్‌ గేర్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఈ ప్రమాదంలో చీరాలకు చెందిన మహిళ, రెండేళ్ల చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన బుకింగ్‌ క్లర్క్ వీరయ్య చనిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి