iDreamPost

IPLలో వచ్చిన డబ్బులతో నా తల్లిదండ్రుల అప్పులన్నీ తీర్చేశా: స్టార్ ప్లేయర్

ఐపీఎల్ వేలం ద్వారా వచ్చిన తన తొలి సంపాదనతో తల్లిదండ్రుల అప్పులన్నీ తీర్చేశానని చెప్పుకొచ్చాడు ఓ స్టార్ ఆల్ రౌండర్. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ వేలం ద్వారా వచ్చిన తన తొలి సంపాదనతో తల్లిదండ్రుల అప్పులన్నీ తీర్చేశానని చెప్పుకొచ్చాడు ఓ స్టార్ ఆల్ రౌండర్. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPLలో వచ్చిన డబ్బులతో నా తల్లిదండ్రుల అప్పులన్నీ తీర్చేశా: స్టార్ ప్లేయర్

ఐపీఎల్.. క్యాష్ రిచ్ లీగ్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ లీగ్ లో ఆడితే డబ్బుకు డబ్బుతో పాటుగా పేరు కూడా వస్తుంది. దాంతో పాటుగా బాగా ఆడితే.. జాతీయ జట్టులోకి పిలిచి మరీ ప్లేస్ ఇస్తారు. ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టే వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెటర్లు ఈ రిచ్ లీగ్ లో ఆడాలని కలలు కంటూ ఉంటారు. కాగా.. ఐపీఎల్ చాలా మంది ఆటగాళ్ల జీవితాలను మార్చేసింది. అందులో నా జీవితం కూడా ఒకటి అంటూ చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్, మాజీ ఆటగాడు క్రిస్ మోరిస్. ఐపీఎల్ లో వచ్చిన తొలి సంపాదనతో తన తల్లిదండ్రుల అప్పులన్నీ తీర్చేశాడట మోరిస్.

క్రిస్ మోరిస్.. స్టార్ ఆల్ రౌండర్ గా ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అతడు తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఐపీఎల్ లో తన అనుభవాల గురించి గుర్తు చేసుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. 2013 సీజన్ తో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మోరిస్. కానీ అతడి పేరు మారుమ్రోగింది మాత్రం ఐపీఎల్ 2021 సీజన్ లోనే. ఆ ఏడాది జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ మోరిస్ ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అప్పట్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

Chris Morris

 

ఇదిలా ఉండగా.. మోరిస్ ను తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. 2013 వేలంలో చెన్నై అతడిని రూ. 4.2 కోట్లకు కొనుక్కుంది. ఆ డబ్బుతో తన తల్లిదండ్రుల అప్పులన్నీ తీర్చేశాడట మోరిస్. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. కాగా.. మోరిస్ తండ్రి విల్లీ మోరిస్ కూడా క్రికెటరే. కానీ అతడికి సౌతాఫ్రికా తరఫున ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. దీంతో తన కొడుకునైనా క్రికెటర్ చేయాలనే తపనతో, పట్టుబట్టి మరీ అతడికి క్రికెట్ నేర్పించాడు. అందుకోసం అప్పు చేయాల్సి వచ్చింది. తన తండ్రి కష్టాన్ని వృథాగా పోనివ్వలేదు మోరిస్.

దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 42 వన్డేలు, 23 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 81 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 95 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే ఓ రేర్ ఐపీఎల్ రికార్డు మోరిస్ పేరిటే అలాగే చెక్కుచెదరకుండా ఉంది. అదేంటంటే? అత్యధిక స్ట్రైక్ రేట్ తో ఇన్నింగ్స్ ఆడిన రికార్డు. ఐపీఎల్ 2017 సీజన్ లో పూణేతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్ గా బరిలోకి దిగి కేవలం 9 బంతుల్లోనే 422.22 స్ట్రైక్ రేట్ తో 28 రన్స్ చేశాడు. మరి ఐపీఎల్ లో వచ్చిన తొలి సంపాదనతో తల్లిదండ్రుల అప్పులు తీర్చిన క్రిస్ మోరిస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: అతనికి వన్డేల్లోనే 221 స్ట్రైక్ రేట్! ఓ విధ్వంసాన్ని కొనే ప్లాన్ లో ఢిల్లీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి