iDreamPost

MPగా బరిలోకి రామ్ చరణ్ హీరోయిన్! ఇంత బ్యాగ్రౌండ్ ఉందా?

  • Published Mar 23, 2024 | 5:51 PMUpdated Mar 23, 2024 | 5:51 PM

రాజకీయాల్లో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినీ నటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు .. ఆమె తండ్రి తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజకీయాల్లో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినీ నటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు .. ఆమె తండ్రి తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 23, 2024 | 5:51 PMUpdated Mar 23, 2024 | 5:51 PM
MPగా బరిలోకి రామ్ చరణ్ హీరోయిన్! ఇంత బ్యాగ్రౌండ్ ఉందా?

దేశంలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సమయంలో చాలా చర్చలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఎంతో మంది కొత్త వారు రాజకీయాల్లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఎలెక్షన్స్ ముగిసే వరకు రాజకీయాలకు సంబంధించిన ప్రతిదీ ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే, ఈ క్రమంలో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినీ నటి .. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆమె తండ్రి ప్రకటించాడు. ఆ హీరోయిన్ తండ్రి కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకుడు అజయ్ శర్మ . ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ నటి, మోడల్ నేహా శర్మ.

నేహా శర్మ అంటే అంత త్వరగా అందరికి గుర్తురాకపోవచ్చు కానీ.. చిరుత సినిమాలో నటించిన హీరోయిన్ అంటే మాత్రం అందరు ఇట్టే గుర్తుపట్టేస్తారు. నేహా శర్మ 2007లో విడుదలైన చిరుత సినిమాలో చరణ్ కు జోడిగా నటించింది. తెలుగులో నటించిన ఈ సినిమాతో నేహా శర్మ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత నేహా శర్మ అంతగా ఏ సినిమాలలోనూ కనిపించలేదు. అయితే నేహా శర్మ తండ్రి.. అజయ్ శర్మ .. కాంగ్రెస్ పార్టీలో ఓ ప్రముఖ రాజకీయ వేత్త. ఆయన ప్రస్తుతం బీహార్ లోని భాగల్ పూర్ లో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహాఘట్‌బంధన్ సీట్ల పంపకంపై చర్చలు జరిపిన తర్వాత .. తమ పార్టీ అదే స్థానం నుంచి పోటీ చేస్తే.. తన కుమార్తెకు ఆ నియోజకవర్గం నుంచి టిక్కెట్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో అజయ్ శర్మ మాట్లాడుతూ.. “కాంగ్రెస్‌కి భాగల్‌పూర్ నియోజకవర్గం కావాలి. అది మా కంచుకోట. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. మాకు ఈ సీటు వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్‌పై ఆధారపడి ఉంది. పార్టీ నన్ను అడిగితే నేను పోటీ చేస్తాను లేదా బహుశా నా కుమార్తె నేహా శర్మ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే, బీహార్ లో “ఇండియా” కూటమి సీట్ల భాగస్వామ్య ప్రకటన .. ఈ వారంలో ఉంటుందని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తెలిపారు. ఇకపోతే 2019లో బీహార్ లోని 40 సీట్లకు గాను ఎన్‌డీఏ 39 స్థానాలను కైవసం చేసుకుంది. మరి నేహా శర్మ రాజకీయ అరంగేంట్రం గురించి.. తన తండ్రి అజయ్ శర్మ ప్రకటించిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి