iDreamPost

Chiranjeevi: మళ్ళీ వైరల్ అవుతున్న చిరు చేతి వాచ్ ధర.. ఎంతంటే!

  • Published Mar 23, 2024 | 5:39 PMUpdated Mar 23, 2024 | 5:39 PM

తాజాగా హైదరాబాద్ లో జరిగిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు.. సౌత్ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఈ క్రమంలో ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి కూడా అటెండ్ అయ్యారు. అయితే, ఇప్పుడు ఇందులో చిరు చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు.. సౌత్ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఈ క్రమంలో ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి కూడా అటెండ్ అయ్యారు. అయితే, ఇప్పుడు ఇందులో చిరు చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

  • Published Mar 23, 2024 | 5:39 PMUpdated Mar 23, 2024 | 5:39 PM
Chiranjeevi: మళ్ళీ వైరల్ అవుతున్న చిరు చేతి వాచ్ ధర.. ఎంతంటే!

హైదరాబాద్ నోవాటెల్ లో .. తాజాగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది స్టార్స్ అటెండ్ అయ్యారు. ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. సౌత్ నుంచి చాలా మంది సెలెబ్రిటీలు ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. అంతేకాకుండా ఈ వేడుకలో మెగాస్టార్ కు చిరు సత్కారం కూడా చేశారు. అయితే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అదే సెలెబ్రిటీల దుస్తులు, ఆర్నమెంట్స్ ధర తెలుసుకుని ఆ ప్రైజ్ ను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరి కళ్ళు చిరు చేతికి ఉన్న వాచ్ మీద పడింది. గతంలో కూడా ఓసారి చిరు వాచ్ ధర వైరల్ అయింది. అయితే, ఇప్పుడు ఈ వాచ్ ధర అంతకు మించి ఉంది. దీని ధర తెలుసుకుంటే అందరు ఆశ్చర్యపోవడం ఖాయం.

సాధారణంగానే సెలెబ్రిటీలు వాడే వస్తువుల ధర కాస్టలీ గానే ఉంటాయి. ఎందుకంటే వారంతా టాప్ బ్రాండ్ వస్తువులనే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో చిరంజీవి దగ్గర కూడా అనేక కాస్టలీ వస్తువులు ఉన్నాయి. చిరు దగ్గర ఉన్న రోలెక్స్ వాచ్ నుంచి బెంజ్ కార్ వరకు కొన్ని కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడం చూశాము. అలాగే గతంలో ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరు చేతికి ఓ సింపుల్ వాచ్ ఉంది. కానీ, దాని ధర మాత్రం అందరిని ఔరా అనేలా చేసింది. అదే ఏ. లాంజ్ & సోహ్నే అనే బ్రిటిష్ కంపెనీకి చెందిన వాచ్. దాని ధర అక్షరాలా రూ.50,56,747. అంటే దాదాపు అరకోటి వరకు పలికింది. ఇక ఇప్పుడు మరోసారి చిరు చేతికి ఉన్న వాచ్ ధర వైరల్ అవుతోంది. ఈ వాచ్ ధర క్రితం దానికంటే మించి ఉంది. ఈ వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందినట్లుగా గుర్తించారు. దీనిని “కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్” అని పిలుస్తారు. రోలెక్స్ కంపెనీలో టాప్ బ్రాండ్ ఇదేనట. దీనిలో మోడల్స్ ను బట్టి ధరలు ఉంటాయి. ఇక చిరు చేతికి ఉన్న వాచ్ ధర విషయానికొస్తే అందరు షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే దీని ధర దాదాపు రూ.1.90 కోట్లు వరకూ ఉంటుంది.

దీనితో ఇప్పుడు ఈ వాచ్ ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక చిరు ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ సెలెబ్రిటీలు అన్న తర్వాత ఇటువంటి కాస్టలీ వస్తువులు ధరించడం కామన్. కానీ, కామన్ పీపుల్ కు మాత్రం వాటి ధరలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌ లో .. నిర్మాత అల్లు అరవింద్ చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడారు. ఇటీవల చిరు పద్మవిభూషణ్ కూడా అందుకోవడంతో.. చిరుకు సత్కారం చేశారు. మరి, ప్రస్తుతం చిరు చేతికి ఉన్న వాచ్ ధర వైరల్ అవుతున్న విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి