iDreamPost

అప్పట్లోనే చిరు, బాలయ్య కలిసి ఓ సినిమా చేశారు.. ఏ సినిమానో తెలుసా?

  • Author ajaykrishna Published - 07:01 PM, Wed - 5 July 23
  • Author ajaykrishna Published - 07:01 PM, Wed - 5 July 23
అప్పట్లోనే చిరు, బాలయ్య కలిసి ఓ సినిమా చేశారు.. ఏ సినిమానో తెలుసా?

ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే.. ఈరోజుల్లో పెద్ద విషయంగా భావిస్తుంటారు. కానీ.. 90లలో అలా కాదు. ఆ ట్రెండ్ వేరు. ఒక్కో సినిమాలో ఒకరిద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు, నలుగురు నటించిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో వారేమి క్యారెక్టర్ పెద్దదా చిన్నదా.. పేరు వస్తుందా లేదా.. ఇవేం పట్టించుకోలేదు. వాళ్లంతా సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. రోజులు మారాయి. సినిమాలు చూస్తున్న జనాల అభిరుచులు, అభిప్రాయాలు కూడా మారిపోయాయి. ఈరోజుల్లో ఒకే సినిమా కోసం ఇద్దరు హీరోలు పనిచేయడం అరుదుగా జరుగుతోంది. దాన్నే మనం ట్రెండ్ అంటూ ప్రచారం చేస్తున్నాం.

ఈ ట్రెండ్ లేనప్పుడే ఎన్నో మల్టీస్టారర్ మూవీస్ తెరపైకి వచ్చిన సంగతి తెలుసు కదా! సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, శోభన్ బాబు, కృష్ణ, బాలకృష్ణ.. ఇలా అందరు ఒకరి సినిమాలో మరొకరు ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేస్తూ అలరించారు. ఇప్పుడు దాన్ని ట్రెండ్ తో కలిపి.. హీరోల ఫ్యాన్స్ నానా హంగామా చేసేస్తున్నారు. అయితే.. ఎంతమంది హీరోలు టాలీవుడ్ లో కొత్తగా వచ్చినా.. రికార్డులు బద్దలు కొట్టినా.. అటు మెగాస్టార్ ఇటు నటసింహం బాలయ్య క్రేజ్ మాత్రం మ్యాచ్ చేయలేరని చెప్పాలి. వీరిద్దరూ మహామహులే.. కానీ, ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు అనే వెలతి ఫ్యాన్స్ లో ఉండిపోయింది.

వెండితెరపై ఓవైపు మెగాస్టార్ ని, మరోవైపు బాలయ్యని చూస్తూ ఎంజాయ్ చేయాలని అందరికి ఉంటుంది. ఇప్పుడది సాధ్యమవుతుందా లేదా చెప్పలేం. కానీ.. వారిద్దరూ ఆల్రెడీ ఓ సినిమాలో కలిసి నటించారు అనే సంగతి ఎంతమందికి తెలుసు. అవును.. మెగాస్టార్ చిరు, బాలయ్య కలిసి ఒకే మూవీలో నటించారు. ఆ మూవీనే త్రిమూర్తులు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో చిరు, బాలయ్యలతో పాటు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున కూడా కనిపించడం విశేషం. అ తర్వాత మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాలేదు. అయినా ఇప్పటికి మంచి కథ దొరికితే చేయడానికి చిరు, బాలయ్యనే కాదు కింగ్ నాగ్ కూడా సిద్ధంగా ఉన్నారని టాక్. మరి వీరి కాంబినేషన్ లో మూవీ వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి