iDreamPost

1.40 ల‌క్ష‌ల సైనికులు, 953 యుద్ధ‌నౌక‌లు, తైనాన్ ఆక్ర‌మ‌ణ‌కు చైనా యుద్ధ‌తంత్రం, ఆడియా లీక్

1.40 ల‌క్ష‌ల సైనికులు, 953 యుద్ధ‌నౌక‌లు, తైనాన్ ఆక్ర‌మ‌ణ‌కు చైనా యుద్ధ‌తంత్రం, ఆడియా లీక్

చైనా సైనిక ఉన్న‌తాధికారుల‌ ఆడియో లీక్ సంచ‌లనం సృష్టిస్తోంది. తైనావ్ ను జ‌యించ‌డానికి షీ జిన్‌పింగ్ మిల‌ట‌రీ ప్లాన్ ను ప్ర‌భుత్వంలోని కీల‌క అధికారి బైట‌పెట్టిన‌ట్లు ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ప్ర‌క‌టించింది. ఇది క‌మ్యునిష్ట పార్టీ ఆఫ్ చైనాకు, చైనా ఆర్మీకి మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు. తైవాన్ ను జ‌యించిన త‌ర్వాత, అధికార‌మార్పిడి గురించి ఉన్న‌తాధికారుల త‌యారుచేసిన రోడ్ మ్యాప్ అమలుపై చ‌ర్చించారు.

తైవాన్ ఆక్ర‌మ‌ణ‌పై, చైనా సైనిక ఉన్న‌తాధికారుల ఆడియో క్లిప్ రిలీజ్ అయిన త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు జో బైడ‌న్ క‌టువుగా స్పందించారు. ఇది ప్ర‌మాదంతో స‌య్యాటగా బీజింగ్ ను అభివ‌ర్ణించారు. క్వాడ్ స‌మ్మిట్ కోసం బైడ‌న్, జ‌పాన్ లో ప‌ర్య‌టిస్తున్నారు. స్వీయ‌పాల‌న‌లో ఉన్న తైవాన్ ను ఆక్ర‌మించాల‌ని చూస్తే, సైనికంగా అడ్డుకొంటామ‌ని చెప్పారు.

వ‌న్ చైనా పాల‌సీని తాము అంగీక‌రిస్తామ‌ని, ఆ ఒప్పందంపై సంత‌కం కూడా చేశామ‌ని అమెరికా అధ్య‌క్షుడు చెప్పారు. అలాగ‌ని తైవాన్‌ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే, తాము సైనిక‌ప‌రంగా అడ్డుకుంటామ‌ని హెచ్చరించారు. తైవాన్‌ను ఆక్ర‌మించే న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కు డ్రాగ‌న్ కంట్రీకి లేద‌ని బైడెన్ తేల్చేశారు..

ఉక్రెయిన్ ను ప్ర‌స్తావిస్తూ, చైనాను భ‌య‌పెట్టే మాట‌ల‌న్నారు. తైవాన్‌ విషయంలో చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని బైడెన్‌ హితవు పలికారు. ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న అకృత్యాల‌కు, పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సిందేన‌ని తేల్చేశారు.

ఈ వైర‌ల్ ఆడియో క్లిప్ ను చైనా మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త జెన్నిఫ‌ర్ హంగ్, ట్వీట్ చేయ‌డంతో బీజింగ్ ర‌గిలిపోతోంది. ఇది 57 నిమ‌షాల ఆడియో క్లిప్. దీన్ని LUDE media యూట్యూబ్ ఛాన‌ల్ పబ్లిష్ చేసింది. చైనా చ‌రిత్ర‌లోనేనే సైనిక ఉన్న‌తాధికారుల క్లిప్ లీక్ ఒక‌టి లీక్ కావ‌డం కావ‌డం ఇదే మొద‌లు.

కాని ఇంత‌వ‌ర‌కు అధికారికంగా ఇంత‌వ‌ర‌కు చైనా స్పందించ‌లేదు. బ‌హుశా తైవాన్ వీటిని రికార్డు చేసి, లీక్ చేయొచ్చు. తైవాన్ ఆక్ర‌మ‌ణ కోసం చైనా చాలా ప్లాన్ లు వేస్తుంది. వాటి సాధ్యాసాధ్యాల మీద అంచ‌నాలు వేస్తూనే ఉంటుంది అందువ‌ల్లే ఈ ఆడియో క్లిప్ గురించి ఎవ‌రికీ ఎలాంటి ఆశ్చ‌ర్యంలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి