iDreamPost

కరోనా జన్మ నగరంలో లాక్ డౌన్ ఎత్తివేత…

కరోనా జన్మ నగరంలో లాక్ డౌన్ ఎత్తివేత…

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ జన్మించిన నగరంగా చెప్పుకునే వుహాన్ నగరంలో లాక్ డౌన్ ను చైనా ప్రభుత్వం ఎత్తివేసింది.. దీంతో అక్కడి ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చారు.. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జనవరి 23న చైనా ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్‌ విధించింది. ఆ తర్వాత హుబే ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచింది.

వుహాన్ నగరానికి రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసిన చైనా ప్రభుత్వం తర్వాత పూర్తి స్థాయిలో నగరాన్ని నిర్బంధించి కఠినమైన ఆంక్షలను అమలు చేసింది..దాదాపు 76 రోజుల పాటు ఈ ఆంక్షలు అమలయ్యాయి..

76 రోజుల తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి చైనాలో దాదాపు తగ్గిపోవడంతో వుహాన్ నగరంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది.. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులలో ప్రజలతో రద్దీ మొదలయింది.. షాపింగ్ మాల్స్, దుకాణాలు మళ్ళీ తెరుచుకున్నాయి.. పాఠశాలలపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.

కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడం వల్ల వుహాన్ నగరంలో దాదాపు 50000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా సుమారు 2500 మరణించారని అధికారికంగా చైనా ప్రభుత్వం వెల్లడించింది. కాగా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నా తక్కువ చేసి చెబుతుందని చైనా ప్రభుత్వంపై ప్రపంచ దేశాలు విమర్శలు చేసాయి. కాగా కరోనా భయం ఇంకా తొలగక పోవడంతో వుహాన్ ప్రజలు ఇంకా మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు.. కాగా వుహాన్ నగరంలో తిరిగి కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు.. 76 రోజుల తర్వాత స్వేచ్ఛ లభించడంతో వుహాన్ నగర వాసులు ఆనందంలో మునిగారు. కాగా మన దేశంలో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి