iDreamPost

సమావేశంలో లో క్యాండీక్రష్ ఆడుతున్న సీఎం.. ఫోటో వైరల్

సమావేశంలో లో క్యాండీక్రష్ ఆడుతున్న సీఎం.. ఫోటో వైరల్

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో హడావుడి మొదలైంది. ఇటీవల కర్ణాటకలో గెలుపు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఐదు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సీఎం క్యాండీ‌క్రష్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బఘేల్, ఇతర మంత్రులు, నేతలు హాజరయ్యారు. మీటింగ్ సీరియ్ గా సాగుతుండగా సీఎం బఘేల్ తన ఫోన్ లో క్యాండీక్రష్ ఆడుతు కనిపించారు. ఇది కాకతాలియంగా జరిగినప్పటికీ దీనికి సంబంధించిన ఓ ఫోటోను బీజేపీ తమ ట్విట్టర్ ఖాతలో షేర్ చేసింది.

ఈ ఫోటో షేర్ చేసిన తర్వాత భాజాపా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా గెలవదని సీఎం భూపేష్ కి బాగా తెలిసినట్లుంది.. అందుకే బాగా రిలాక్స్ అవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సమావేశంలో ఆయన శ్రద్ద చూపించాల్సింది పోయి.. క్యాండీక్రష్ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు’ అంటూ ఎద్దేవా చేస్తూ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి