iDreamPost

India vs England: అతిథి మర్యాదగా తొలి టెస్టు ఇచ్చాం! 4-1తో ఓడిస్తాం: మాజీ క్రికెటర్‌

  • Published Feb 01, 2024 | 5:12 PMUpdated Feb 01, 2024 | 5:12 PM

ఇంగ్లండ్‌తో రెండోకు టీమిండియా రెడీ అవుతుంది. తొలి ఓటమి భారాన్ని రెండో టెస్టులో విజయంతో దించేసుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్‌ చేసిన వ్యాఖ్యలు బూస్టప్‌ ఇచ్చేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో రెండోకు టీమిండియా రెడీ అవుతుంది. తొలి ఓటమి భారాన్ని రెండో టెస్టులో విజయంతో దించేసుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్‌ చేసిన వ్యాఖ్యలు బూస్టప్‌ ఇచ్చేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 01, 2024 | 5:12 PMUpdated Feb 01, 2024 | 5:12 PM
India vs England: అతిథి మర్యాదగా తొలి టెస్టు ఇచ్చాం! 4-1తో ఓడిస్తాం: మాజీ క్రికెటర్‌

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా రెండో టెస్ట్‌కు సిద్ధమైంది. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి స్టేడియంలో శుక్రవారం ఈ మ్యాచ్‌ మొదలుకానుంది. ఇప్పటికే హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత.. భారత జట్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా క్రికెట్‌ అభిమానులు సైతం కొంతమంది ఆటగాళ్లపై మండిపడుతున్నారు. ఈ కమ్రంలో భారత మాజీ క్రికెటర్‌, మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ మాత్రం ఇండియన్‌ టీమ్‌కు మద్దతుగా నిలుస్తూ.. వాళ్లకు మంచి బూస్టప్‌ ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

ఇంగ్లండ్‌ తమ దేశానికి వచ్చిన అతిథి, అందుకే తొలి టెస్ట్‌తో వెల్‌కమ్ చెప్పాం. అంత మాత్రం దానికి కంగారుపడాల్సిన పనిలేదు. ఇంగ్లండ్‌ను 4-1 తేడాతో ఓడిస్తామంటూ చేతన్‌ శర్మ ఇంగ్లండ్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. శుక్రవారం నుంచి విశాఖపట్నం వేదికగా భారత్‌ ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో చేతన్‌ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో నిజానికి ఇండియానే గెలవాల్సింది. కానీ, అనూహ్యంగా ఇంగ్లండ్‌ చివర్లో అద్భుతం ఆటతో విజయం సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 246కే ఆలౌట్‌ చేసి, తమ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసినా ఇండియా ఓటమి పాలవ్వడం గమనార్హం.

కనీసం 231 పరుగుల టార్గెట్‌ను కూడా ఛేజ్‌ చేయలేక చేతులెత్తేయడంతో భారత క్రికెటర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ దారుణంగా విఫలం అయ్యారు. ఇక తొలి టెస్టులో మంచి ప్రదర్శన కనబర్చిన రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ గాయాలతో రెండో టెస్టుకు దూరం అయ్యారు. ఇలా అన్ని విధాల ప్రస్తుతం టీమిండియా కష్టాల్లో ఉంది. ఇక రెండో టెస్టులో ఒక్క రోహిత్‌ శర్మ మినహా.. మిగతా టీమ్‌ మొత్తం యువ క్రికెటర్లతో నిండిపోనుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను టీమిండియా 4-1 తేడాతో ఓడిస్తుందని చేతన్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి