iDreamPost

Chandramukhi 2 చంద్రముఖి 2 అసలు కథేంటి

Chandramukhi 2 చంద్రముఖి 2 అసలు కథేంటి

2005లో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖి ఎప్పటికి మర్చిపోలేని ఒక ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్. అంత పెద్ద స్టార్ హీరో ఒక హారర్ సినిమా చేసి దాంతోనూ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఆ సినిమాకు మాత్రమే సాధ్యమయ్యింది. ఒరిజినల్ వెర్షన్ మలయాళం, కన్నడ నుంచి తీసుకున్నప్పటికీ దర్శకుడు పి వాసు తలైవా ఇమేజ్ కి తగ్గట్టు తీర్చిదిద్దిన తీరు వసూళ్ల వర్షం కురిపించింది. చెన్నైలో ఏకధాటిగా ఏడాదికి పైగా ఆడిన రికార్డు సొంతం చేసుకున్న ఘనత దీనికే దక్కింది. అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వంద రోజులు సెంటర్లు రావడం అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటారు. టీవీలో వచ్చిన ప్రతిసారి టిఆర్పి రేటింగ్స్ తో అదరగొట్టే క్లాసిక్ ఇది.

ఇప్పుడు దీని గురించిన చర్చ రావడానికి కారణం నిన్న ప్రకటించిన చంద్రముఖి 2. లారెన్స్ హీరోగా 2.0 లాంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన లైకా సంస్థ దీన్ని నిర్మిస్తోంది. దర్శకుడిగా పి వాసు వ్యవహరించబోతున్నారు. అయితే నిజానికి దీని సీక్వెల్ 2010లోనే వచ్చింది. ఆప్తరక్షక పేరుతో విష్ణువర్ధన్ తో వాసునే తీశారు. బాగా ఆడింది. కట్ చేస్తే అదే ఏడాది తెలుగులో వెంకటేష్ హీరోగా తిరిగి రీమేక్ చేశారు. కానీ ఇక్కడ డిజాస్టర్ అయ్యింది. అదే కథను రిపీట్ చేసినట్టుగా ఫీలవ్వడంతో మన ఆడియన్స్ నో అనేశారు. దీంతో తమిళంలో తీయాలనే ప్రతిపాదన ఆగిపోయింది. రజినీకాంత్ నాగవల్లిని చూసి వర్కౌట్ కాదని చెప్పి ప్రతిపాదన డ్రాప్ అయ్యారు.

ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చంద్రముఖి 2 మళ్ళీ తెరపైకి వచ్చింది అయితే ఇది నాగవల్లి కథ కాకపోవచ్చు. ఎందుకంటే అరవంలో తీయకపోయినా ఇది యుట్యూబ్ లో, ఓటిటిలో జనాలు చూసేశారు. ఒకవేళ లేదనుకున్నా ఆ సబ్జెక్టు ఇప్పుడు వర్కౌట్ కాదు. మధ్యలో పన్నెండేళ్ల గ్యాప్ ఉంది. దెయ్యాల జానర్ అసలే ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. అలాంటప్పుడు అరిగిపోయిన లైన్లతో జనాలను మెప్పించడం కష్టం. అందులోనూ పి వాసు ఇప్పుడు ఫామ్ లో లేరు. శివలింగ కూడా కమర్షియల్ గా పాస్ అయ్యింది కానీ చంద్రముఖి రేంజ్ అయితే కాదు. అన్నట్టు ఈ చంద్రముఖి 2కి కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ఏమో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి