iDreamPost

మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరవుతున్న చంద్రబాబు!

ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. అవసరానికి తమ హీరోని వాడుకొని వదిలేస్తారు, తర్వాత ఆయననే విమర్శిస్తారు.. ఇదంతా మాకు, మా హీరోకి అవసరమా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. అవసరానికి తమ హీరోని వాడుకొని వదిలేస్తారు, తర్వాత ఆయననే విమర్శిస్తారు.. ఇదంతా మాకు, మా హీరోకి అవసరమా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరవుతున్న చంద్రబాబు!

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ని త్వరలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కలవబోతున్నాడనే వార్త బలంగా వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. అవసరానికి తమ హీరోని వాడుకొని వదిలేస్తారు, తర్వాత ఆయననే విమర్శిస్తారు.. ఇదంతా మాకు, మా హీరోకి అవసరమా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సినిమాలు మాత్రమే చేసుకుంటున్నాడు. అయినప్పటికీ కొందరు టీడీపీ నేతలు పదే పదే ఆయనను రాజకీయాల్లోకి లాగుతూ విమర్శలు చేస్తుంటారు. సినిమా హీరోలకు రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలలో అభిమానులు ఉంటారనే విషయాన్ని మరిచి.. ఆయన సినిమాలకు ఎవరైనా ఇతర పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టినా విమర్శించారు. ఆయన సన్నిహితులు పార్టీ మారినా ఎన్టీఆర్ నే టార్గెట్ చేశారు. మేనత్త నారా భువనేశ్వరికి అవమానం జరిగితే స్పందించలేదన్నారు. స్పందించాకేమో ‘సినిమాల్లో మాదిరిగా అమ్మతోడు అడ్డంగా నరుకుతా’ అనకుండా, పద్ధతిగా స్పందించావు అంటూ మళ్ళీ విమర్శించారు. ఇక తన తాత ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ ప్రజాదరణ గలిగిన నాయకులే అన్నందుకు జూనియర్ పైన దారుణంగా విరుచుకుపడ్డారు. టీడీపీలోని పెద్ద నాయకులు సైతం జూనియర్ పై దారుణ వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. మరోవైపు బాలకృష్ణ ఒక షోలో ‘వైఎస్సార్ గ్రేట్ లీడర్’ అంటే మాత్రం ఒక్క టీడీపీ నేత కూడా విమర్శించలేదు. ఇదంతా చూసి, కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఏర్పడింది. ఎన్టీఆర్ ముందు తన తనయుడు నారా లోకేష్ నిలబడలేడని, అతను వస్తే టీడీపీ పగ్గాలు తీసుకొని లోకేష్ కి రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తాడనే భయంతోనే.. ఎన్టీఆర్ ని చంద్రబాబు టీడీపీకి దూరం చేస్తున్నాడనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్లే ఇంతకాలం సొంత పార్టీ శ్రేణుల చేతే దారుణంగా విమర్శలు చేయించిన ఆయన.. ఇప్పుడు అవసరం కోసం మళ్ళీ ఎన్టీఆర్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడని న్యూస్ వినిపిస్తోంది.

గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మరో ఘోర పరాజయం తప్పదని భావించి.. పొత్తుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పైగా ఇవి చంద్రబాబు తనకు చివరి ఎన్నికలు అంటున్నాడు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక భవిష్యత్ లో లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్న ఆశ ఆ పార్టీ శ్రేణుల్లో లేదు. అందుకే వచ్చే ఎన్నికల కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని భావించిన చంద్రబాబు.. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరై ఆయన అభిమానుల ఓట్లతో లబ్ది పొందాలని చూస్తున్నాడని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే ఈ వార్త విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అవసరమైనప్పుడు దగ్గరకు వస్తారు, తర్వాత దూరం పెట్టి దారుణంగా మాట్లాడతారు.. వాళ్ళ మాయ మాటలకు కరిగిపోవద్దు అన్న అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది, ఇలాంటి సమయంలో రాజకీయ ఉచ్చులో చిక్కుకొని కెరీర్ ని రిస్క్ లో పెట్టొద్దని అభిమానులు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి