iDreamPost

చంద్రబాబు శపథం

చంద్రబాబు శపథం

విశాఖ పర్యటన అర్థంతరంగా ఆగిపోవడంతో మాజీ సీఎం నారా చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనలో పట్టుదల పెరిగినట్లుంది. 25 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 11 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన తననే ఆపుతారా..? అంటూ నిన్న విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయన ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. మొత్తం మీద తిరిగి పయానం కావల్సి వచ్చినందుకు చంద్రబాబులో పట్టుదల బాగా పెరిగినట్లుంది. ఈ రోజు పార్టీ నేతలతో వీడియా కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. నిన్న ఘనటపై వారికి వివరించి.. మళ్లీ విశాఖ పర్యటనకు వెళతానంటూ స్పష్టం చేశారు. ఎన్ని సార్లు ఆపుతారో చూస్తానంటూ ఆయన అన్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

విశాఖ ఘటనలో చంద్రబాబు వైఎస్సార్‌సీపీ వారు తనను అడ్డుకోలేదని చెబుతున్నారు. కానీ వైఎస్సార్‌సీపీ వారే డబ్బుల్చి మరీ మనుషులను పంపారని ఆరోపించారు. పార్టీ జెండాలు లేకుండా.. ప్రజా సంఘాల పతాకాలు పట్టుకుని రావడంతోనేమో బహుశా చంద్రబాబుకు ఈ అనుమానం వచ్చుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏమైనా.. తనను అడ్డుకుందని వైఎస్సార్‌సీపీ వారు కాదని చంద్రబాబే చెప్పినట్లైందంటున్నారు.

విశాఖలో పర్యటించి తీరుతానని సీఎం చంద్రబాబు శపథం చేసిన నేపథ్యంలో మళ్లీ ఆయన టూర్‌ ఎప్పుడుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న దాదాపు ఐదు గంటల పాటు విశాఖ ఎయిర్‌పోర్టులో హై డ్రామా నడిచింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు మద్ధతు తెలిపిన తర్వాతనే అడుగుపెట్టాలని ప్రజలు, ప్రజా సంఘాల వారు గట్టిగా డిమాండ్‌ చేశారు. పోలీసులు లాఠీ ఛార్జి చేసిన చంద్రబాబు కాన్వాయ్‌ను ముందుకు కదలనీయలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి చంద్రబాబు వెళ్లే ముందు నిర్వహించే ప్రెస్‌మీట్లలో విశాఖపై ఏదైనా ప్రకటన చేసి వారి అభిమానాన్ని చూరగొంటారా..? లేదా ఎప్పటిలాగా విశాఖను నేనే అభివృద్ధి చేశా..? అనే మాటలే వల్లె వేస్తారా..? అనేది వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి