iDreamPost

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

ఇటీవలె నైరుతి రుతు పవనాలు నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండుతున్నడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. ఉక్కపోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు కూడా రైతాంగానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శుభవార్తను అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోందని, అది అల్పపీడనంగా మారి ఆగ్నేయ వైపు కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.
ఇటీవలె నైరుతి రుతు పవనాలు నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం అల్పపీడనంగా మారిన అనంతరం దాని దిశగమనం ఏపీ వైపు మళ్లే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది.
దీని ఫలితంగా ఏపీలోని ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు. కాగా అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం, తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్పమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి