iDreamPost

ఐఫోన్స్, ఐపాడ్స్ వాడే వారికి కేంద్రం హై రిస్క్ వార్నింగ్.. ఏం జరిగిందంటే

  • Published Apr 03, 2024 | 8:49 PMUpdated Apr 03, 2024 | 8:49 PM

Apple Products: యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఏం జరిగిందంటే..

Apple Products: యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఏం జరిగిందంటే..

  • Published Apr 03, 2024 | 8:49 PMUpdated Apr 03, 2024 | 8:49 PM
ఐఫోన్స్, ఐపాడ్స్ వాడే వారికి కేంద్రం హై రిస్క్ వార్నింగ్.. ఏం జరిగిందంటే

యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్, క్రేజ్ ఉంది. మన దగ్గర కూడా చాలా మంది స్మార్ట్ ఫోన్ అనగానే ఐఫోన్ కే తమ ఓటు అంటారు. ఇక సెలబ్రిటీలంతా ఐఫోన్, ఐప్యాడ్ నే ఎక్కువగా వినియోగిస్తారు. ఈ ఉత్పత్తులకు ఇంత గిరాకీ ఉండటానికి ప్రధాన కారణం.. వాటిలోని సెక్యూరిటీ ఫీచర్లు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో.. వేర్వేరు దేశాల్లో తయారీ యూనిట్లను నెలకొల్పుతుంది. భారత్ లో కూడా యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా యాపిల్ యూజర్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. కారణం ఏంటి అంటే..

యాపిల్ ఉత్పత్తుల్లో.. ఐఫోన్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, విజన్ ప్రో హెడ్ సెట్స్‌కు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఉత్పత్తుల్లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్‌కు సంబంధించి క్లిష్టమైన సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు తాము గుర్తించామని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సీఈఆర్టీ-ఇన్) వెల్లడించింది. ఈ లోపం వల్ల హ్యాకర్స్ విజృంభిస్తారని చెప్పుకొచ్చారు.

Iphone

యాపిల్ ఉత్పత్తుల్లో ఉన్న ఈ లోపం కారణంగా.. హ్యాకర్స్ ఏకపక్షంగా కోడ్ ఎగ్జిక్యూట్ చేసి మన పరికరాలను రిమోట్‌గానే ఆపరేట్ చేసే అవకాశం ఉందని సీఈఆర్టీ-ఇన్ హెచ్చరించింది. అందువల్ల యూజర్స్ వెంటనే తమ ఉత్పత్తుల్ని లేటెస్ట్ సెక్యూరిటీ వెర్షన్‌తో అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

ఐఓఉస్, ఐప్యాడ్ ఓఎస్ 17.4.1, 16.7.7 కంటే ముందు వెర్షన్లు, సఫారీ 17.4.1, మ్యాక్ఓఎస్ వెంట్యురా 13.6.6, మ్యాక్ఓఎస్ సొనోమా 14.4.1, యాపిల్ విజన్ ఓఎస్ 1.1.1 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాల్ని గుర్తించినట్లు సీఈఆర్టీ-ఇన్ వెల్లడించింది. 17.4.1 కంటే ముందు ఓఎస్ వినియోగించే ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐప్యాడ్ ప్రో 12.9, 10.5, 11 ఇంచెస్ ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ యూజర్లకు ఈ హ్యాకింగ్ ముప్పు అధికంగా ఉంటుందని సీఈఆర్టీ-ఇన్ చెప్పుకొచ్చింది.

Iphone

ఇంకా 16.7.7 వెర్షన్ కంటే ముందు ఓఎస్ లను వినియోగించే.. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐప్యాడ్ ఐదో జెనరేషన్, ఐప్యాడ్ ప్రో 9.7 యూజర్లు కూడా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉంటుందని సీఈఆర్టీ హెచ్చరించింది. వీరు కూడా వెంటనే తమ డివైజ్‌లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అయితే కేంద్రం గతంలో కూడా యాపిల్‌కు చెందిన పలు ప్రొడక్ట్స్‌పై ఇలాంటి సెక్యూరిటీ అలర్ట్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి