iDreamPost

జమ్మూ కశ్మీర్‌పై కరెన్సీ వర్షం..

జమ్మూ కశ్మీర్‌పై కరెన్సీ వర్షం..

జమ్మూ కశ్మీర్‌పై కేంద్రప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధికి రూ.30,750 కోట్లు కేటాయించడం విశేషం. అదే విధంగా జమ్మూ కశ్మీర్‌ నుంచి విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన లద్ధాఖ్‌ అభివృద్ధికి రూ. 5,958 కోట్లు కేటాయించారు.

నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2019లో రెండో సారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌ దేశంలో జమ్మూ కశ్మీర్‌ విలీనమైనప్పటి నుంచి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలగించింది. జమ్మూ కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా శాసన సభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ను ఏర్పాటు చేస్తూ దాని నుంచి లద్ధాఖ్‌ను వేరు చేసింది. లద్దాక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది.

Read Also: కేంద్ర బడ్జెట్‌.. రంగాలు..కేటాయింపులు..

దాదాపు నాలుగు నెలలుగా జమ్మూకశ్మీర్‌ కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది. ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేసింది. రాజకీయ నేతలను గృహనిర్భందించింది. జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధే తమ లక్ష్యమని అప్పట్లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు తాజా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌కు రూ.30,750 కోట్లు కేటాయించి ఆ ప్రాంత ప్రజల మనస్సులు చూరగొనేందుకు ప్రయత్నించిందని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి