iDreamPost

ఈ కుర్రాడు ఓ స్టార్ క్రికెటర్ కొడుకు! ఇతని నాన్న అంటే అందరికీ భయమే!

మీరు చూస్తున్న ఈ యంగ్ క్రికెటర్ ఓ స్టార్ క్రికెటర్ కొడుకు. తండ్రి బాటలోనే నడిచి క్రికెట్ నే కెరియర్ గా మలుచుకున్నాడు. మరీ ఈ యంగ్ క్రికెటర్ ను మీరు గుర్తించగలరా?

మీరు చూస్తున్న ఈ యంగ్ క్రికెటర్ ఓ స్టార్ క్రికెటర్ కొడుకు. తండ్రి బాటలోనే నడిచి క్రికెట్ నే కెరియర్ గా మలుచుకున్నాడు. మరీ ఈ యంగ్ క్రికెటర్ ను మీరు గుర్తించగలరా?

ఈ కుర్రాడు ఓ స్టార్ క్రికెటర్ కొడుకు! ఇతని నాన్న అంటే అందరికీ భయమే!

సినిమా స్టార్ల కుమారులు సినిమాల్లోకి రావడం ఎంత సహజమో.. క్రికెటర్ల పిల్లలు కూడా క్రికెట్ ను ఎంచుకోవడం అంతే సహజంగా మారింది. మనదేశంలో క్రికెట్ అంటే ఎంత పిచ్చిగా ప్రేమిస్తారో తెలిసిందే. ఇప్పటికే పలువురు మాజీ టీమిండియా క్రికెటర్ల కుమారులు క్రికెట్ ను కెరియర్ గా మలుచుకున్నారు. అందులో క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అర్జున్ టెండూల్కర్ ఒకరు. ఇక మరో టీమిండియా మాజీ ఓపెనర్ విధ్యంసకర బ్యాటర్ వీరేంద్ర సేహ్వాగ్ కుమారుడు కూడా క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకున్నాడు. వీరు పెద్ద కుమారుడు ఆర్యవీర్ సేహ్వాగ్ ఇప్పటికే పలు మ్యాచ్ లలో ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే ఆర్యవీర్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీమిండియా మాజీ విధ్సంకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వీరు బరిలోకి దిగాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. వీరు క్రీజులో ఉన్నడంటే బౌలర్లకు చెమటు పట్టాల్సిందే. తనదైన శైలిలో బ్యాటు ఝుళిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే సత్తా ఉన్నవాడు వీరేంద్ర సెహ్వాగ్. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో 319 పరుగులు సాధించి ట్రిపుల్ సెంచరీతో సరికొత్త రికార్డును సృష్టించాడు. భారత జట్టు తరఫున టెస్టు క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను సాధించిన బ్యాట్స్ మెన్ గా వీరు నిలిచారు. ఇప్పుడు వీరు కుమారుడు ఆర్యవీర్ కూడా తండ్రికి తగ్గ తనయుడుగా క్రికెట్ లో రాణిస్తున్నాడు.

ఆర్యవీర్ ప్రస్తుతం బీసీసీఐ దేశవాళీ జూనియర్ టోర్నీ అయిన విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్ 16లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ఆర్యవీర్ ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. మూడు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ సోమవారం ప్రారంభమైంది. ఇక జూనియర్ సెహ్వాగ్ ఢిల్లీ జట్టుకు ఓపెనర్ బ్యాట్స్ మెన్. కర్ణాటక- ఢిల్లీ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్యవీర్ 98 బంతుల్లో 50 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఇక ఆర్యవీర్ సెహ్వాగ్ ఆట తీరు చూస్తుంటే తండ్రిని మించిన ప్లేయర్ అవుతాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ టీమిండియా ఆటగాడంటూ వీరూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి లెజండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి