iDreamPost

వీడియో : అందరూ చూస్తుండగానే బస్సును మింగేసిన వాగు..

వీడియో : అందరూ చూస్తుండగానే బస్సును మింగేసిన వాగు..

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. మనాలిలో వరదల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వరదల కారణంగా వంతెనలు కూలిపోతున్నాయి.. కార్లు ఇతర వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ప్రస్తుతం వరద భీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వరదల్లో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయిన ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో.. ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది. పెద్ద ఎత్తున వరద పోటు బస్సును ముంచేసింది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో బస్సును మింగేసింది. 31 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో వదర ఉదృతికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ బస్సుల పరిస్థితే ఇలా ఉంటే.. మనుషుల పరిస్థితి ఇంకేంటి..’’ ఆ బస్సులో మనుషులు ఉండి ఉంటే చాలా ప్రాణ నష్టం జరిగేది’’ అంటూ కామెంట్ల చేస్తున్నారు.

ఇక, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పరిస్థితిపై ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రజలు ఇళ్లలోనే ఉండాలి బయటకు రాకూడదు. రాష్ట్రంలోని ప్రజలందరూ 24 గంటలూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోండి. మీ సహాయార్థం 24 గంటల హెల్ప్‌లైన్‌ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను అన్ని వేళలా సిద్ధంగా ఉంటాను’’ అని పేర్కొన్నారు. మరి, వైరల్‌గా మారిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి