iDreamPost

ఆపరేషన్ వికటించి ప్రముఖ సింగర్ మృతి.. విషాదంలో ఫ్యాన్స్

Pop star Dani Li Passes away: ఇటీవల పలు రంగాల్లో సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే వారు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

Pop star Dani Li Passes away: ఇటీవల పలు రంగాల్లో సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే వారు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

ఆపరేషన్ వికటించి ప్రముఖ సింగర్ మృతి.. విషాదంలో ఫ్యాన్స్

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెండితెర, బుల్లి తెరకు సంబంధించిన నటీనటులు, ఇతర విభాగాలకు చెందిన వారు కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్యం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, కెరీర్ సరిగా లేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పపడుతూ సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే సెలబట్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర దుఖఃంలో మునిగిపోతున్నారు. ఇటీవల కొతమంది మోడల్స్, సింగర్స్, సెలబ్రెటీల ఆపరేషన్ వికటించి కన్నుమూస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ స్టార్ సింగర్ కన్నమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..

బ్రెజిలియన్ పాప్ స్టార్ డాని లీ అలియాస్ డేనియల్ ఫోన్సెకా మచాడో, లైపోసక్షన్, బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలు వికటించడంతో 42 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. లైపోసక్షన్ మెట్రో కథనం ప్రకారం బ్రెజిల్ లో పాప్ సింగర్ గా డాని లీ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇటీవల తన శరీరంలోని కొన్ని భాగాల్లో కొవ్వును తొలగించుకునేందుకు ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆమె శరీరంలో పలు మార్పులు, తీవ్ర అనారోగ్యానికి గురికావడం జరిగిందని.. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామాలకు తామంతా షాక్ తిన్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Popular singer passed away

అమెజాన్ లోని అఫునా ద్వీపంలో పుట్టిన డాని లీ ఐదేళ్ల వయసు నుంచే పాటలు పాడుతూ తన టాలెంట్ తో ఎంతో పేరు తెచ్చుకుంది. తర్వాత సింగింగ్ కెరీయర్ కోసం 17 ఏళ్ల వయసులో మాకాపాకు వెళ్లింది. 2014 లో రిలీజ్ అయిన ‘యూసౌ డా అమెజోనియా’ అనే పాటతో మ్యూజిక్ లవర్స్ ని ఉర్రూతలూగించింది. వివిధ దేశాల్లో తన షోలతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. కైక్, వెమ్ మీ డైజర్, ప్రా వోస్ ఫికార్ కమికో తదితర సాంగ్స్ తో బ్రెజిల్ లో స్టార్ సింగర్ గా పేరు సంపాదించింది. డాని లీ చివరి సాంగ్ ‘గుయెడ్రా డి అమోర్’ ఈ నెల 14 న రిలీజ్ అయ్యింది. ఆమె మరణంపై సెలబ్రెటీలే కాదు.. ఫ్యాన్స్ కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dani Li (@danili.dl)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి