iDreamPost

తెలుగు రీమేకులకు బాలీవుడ్ షాక్

తెలుగు రీమేకులకు బాలీవుడ్ షాక్

తెలుగులో ఆడేశాయి కదాని గుడ్డిగా హిందీలో రీమేక్ చేయడానికి తొందరపడితే అంతే సంగతులు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ అంత స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం యూత్ ఫుల్ కంటెంట్ ప్లస్ హీరో క్యారెక్టరైజేషన్. అంతే తప్ప ఊరికే హిట్ అయిపోలేదు. కానీ లేటెస్ట్ గా వస్తున్నవి చూస్తే మాత్రం మన నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వసూళ్ల సాక్షిగా కనిపిస్తున్నాయి. ఆ మధ్య నాని జెర్సీని షాహిద్ కపూర్ తో అదే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి టైటిల్ మార్చకుండా ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారు. కట్ చేస్తే మరీ దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. ఓటిటిలో కూడా దీన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.

నిన్న హిట్ ది ఫస్ట్ కేస్ ని హిందీలో రిలీజ్ చేశారు. ఇక్కడ విశ్వక్ సేన్ క్యారెక్టర్ ని హిందీలో రాజ్ కుమార్ రావు పోషించారు. ఓపెనింగ్స్ చాలా డల్ గా వచ్చాయి. రివ్యూస్ పర్లేదని చెప్పాయి కానీ పబ్లిక్ మాత్రం దీని మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి క్రైమ్ కంటెంట్ ఓటిటిలోనే బోలెడు దొరుకుతుండగా ప్రత్యేకంగా థియేటర్లో చూడాల్సిన అవసరం లేదనేది వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ ఎక్స్ ట్రాడినరిగా ఉంటే పబ్లిక్ పెరిగేవారేమో కానీ ఇప్పుడీ హిట్ అంత ప్రత్యేకంగా కనిపించడం లేదు. ఈ రెండు సినిమాలకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామి కావడం గమనార్హం. బాలీవుడ్ తొలి రెండు సినిమాలకు ఇలా జరగడం ఆయన ఊహించని పరిణామం.

వీటి దెబ్బకు త్వరలో రీమేక్ కు ప్లాన్ చేసుకున్నవి మరోసారి పునఃపరిశీలించే ఆలోచన ఉందట. ఇప్పుడీ వరసలో అల్లరి నరేష్ నాంది కూడా ఉంది. దాన్నెలా రిసీవ్ చేసుకుంటారో ఊహించడం కష్టం. కేవలం కమర్షియల్ అండ్ విజువల్ గ్రాండియర్ సినిమాలకు మాత్రమే నార్త్ ఆడియన్స్ కు సౌత్ కంటెంట్ పట్ల ఆసక్తి ఉంటుంది. అంతే తప్ప స్పోర్ట్స్ డ్రామాలు, ఎమోషనల్ స్టోరీలు ఇప్పటికీ వాళ్ళు బోలెడు చూసున్నారు. అందులోనూ ఓటిటిలో ఎక్కువగా వచ్చేవి ఇవే. సో సీరియస్ కంటెంట్ ని రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఈ క్యాలికులేషన్స్ అన్నీ చెక్ చేసుకోవడం అవసరం. లేదంటే ఫ్లాపుల కౌంట్ పెరగడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి