iDreamPost

క్రేజీ కాంబోలో బ్లాక్ బస్టర్ సీక్వెల్

క్రేజీ కాంబోలో బ్లాక్ బస్టర్ సీక్వెల్

టాలీవుడ్ వరకు మనం ఫ్యాక్షన్ సినిమాల ప్రభంజనం ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి లాంటి మూవీస్ తో మొదలైందనుకుంటాం కాని వీటి కన్నా ముందే కమల్ హాసన్ చేసిన ‘క్షత్రియ పుత్రుడు’ ఈ జానర్ కి ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. తెలుగులో అంతకు మునుపు కడప రెడ్డెమ్మ తీశారు కాని అది మరీ గొప్ప ఫలితాన్ని అందుకోలేదు కాబట్టి ప్రేక్షకులకు అంతగా గుర్తు లేకపోయింది. దేవర్ మగన్ గా తమిళ్ లో రూపొందిన క్షత్రియ పుత్రుడులో నడిగర్ శివాజీ గణేషన్ తండ్రి పాత్రలో అద్భుతంగా జీవించి పండించారు. రేవతి, గౌతమి హీరొయిన్లుగా వడివేలుకు దీంతోనే గుర్తింపు వచ్చింది.

రెండు దాయాది కుటుంబాల మధ్య వైరం గ్రామాలను ఎలా మాడ్చి మసి చేసిందనే పాయింట్ మీద దర్శకుడు భరతన్ తీర్చిదిద్దిన తీరుకు రెండు బాషల్లోనూ ఘన విజయం దక్కింది. ఇళయరాజా సంగీతం కూడా గొప్ప అసెట్ గా నిలిచింది. ఇప్పటికీ సన్నాజాజి పాడాకా అనే పాట అప్ కమింగ్ సింగర్స్ పాడుతూనే ఉంటారు. ఇప్పుడు దీని సీక్వెల్ కి రంగం సిద్ధమవుతోంది. తలైవన్ ఇరుక్కిన్డ్రాన్ పేరుతో రూపొందబోయే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. అయితే ప్రధాన పాత్రలో కమల్ హాసన్ చేయడం లేదు. ఆయనకు బదులుగా విజయ్ సేతుపతి హీరోగా కనిపిస్తారట.

నిర్మాణం కమల్ స్వంత సంస్థ రాజ్ కమల్ బ్యానర్ మీదే ఉంటుంది. కీలకమైన చిన్న క్యామియో మాత్రమే కమల్ ఇందులో చేయబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన లాక్ డౌన్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. క్షత్రియ పుత్రుడు వచ్చి ఇప్పటికే 28 ఏళ్ళు దాటింది. ఇంత గ్యాప్ తర్వాత దానికి సీక్వెల్ అంటే ఖచ్చితంగా అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఇప్పటికే ఇది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. భరతన్ ఇప్పుడు మనమధ్య లేరు కాబట్టి దర్శకుడు ఎవరనే విషయంలో క్లారిటీ లేదు. కమలే డైరెక్ట్ చేయొచ్చని వినికిడి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి