iDreamPost

Bigg Boss Telugu OTT : పూర్తి భిన్నంగా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. ఎప్పటి నుంచి అంటే?

Bigg Boss Telugu OTT : పూర్తి భిన్నంగా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. ఎప్పటి నుంచి అంటే?

‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షో చాలా పాపులర్ అయింది. మిగతా అన్ని భాషల కంటే ఎక్కువ తెలుగు వారు ఆదరించడంతో ఐదు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. టీవీలో వచ్చిన స్పందనతో ఉత్సాహంగా ఉన్న స్టార్ గ్రూప్ ఓటీటీ కోసం కొత్త సీజన్‌ను ప్రారంభిస్తోంది. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ ప్రకటించిన సమయంలోనే నెక్స్ట్ సీజన్ గురించి షో నిర్వాహకులు ప్రకటన చేయడం అందరికీ తెలుసు. అయితే దీనిని ఓటీటీ సీజన్ వన్ అంటారో, లేక బిగ్ బాస్ సీజన్ 6 అంటారో తెలియదు కానీ ఈ ఓటీటీ షోకి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. నిజానికి ఇటీవల, బిగ్ బాస్(హిందీ)ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్ వూట్(voot) ప్రసారం చేసింది. ఈ క్రమంలో ఈ హిందీ షోకు మంచి ఆదరణ లభించింది.

క అదే బాటలో నడిచి క్యాష్ చేసుకునేందుకు స్టార్ గ్రూప్ తెలుగు ఓటీటీ బిగ్ బాస్ ను విభిన్నంగా ప్లాన్ చేసింది. ఇది 10 వారాల లోపు ఉండేలా చిన్నగా ప్లాన్ చేస్తున్నారు. డిస్నీ+హాట్‌స్టార్ ‘బిగ్ బాస్ తెలుగు’ ఓటీటీ వెర్షన్‌ను నాగార్జున హోస్ట్‌గా ప్రసారం చేయడానికి రంగం సిద్ధం చేసారు. బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు కంటెస్టెంట్‌లను ఫైనల్ చేసే పనిలో ఉంది. ఈ సారి కూడా కంటెస్టెంట్‌ లు యూట్యూబ్, సోషల్ మీడియా సహా సినీ,టీవీ రంగాలకు చెందిన వారు ఉంటారని భావిస్తున్నారు.

దాదాపు 15 మంది సభ్యులను ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేశారని, ఆ పదిహేను మందే ఈసారి సీజన్లో పాల్గొనబోతున్నరని అంటున్నారు. ఇక ఫిబ్రవరి 2022 చివరి వారం నుంచి ఈ ఓటీటీ బిస్ బాస్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకరకంగా నాగార్జునకు ఇది డబుల్ బొనాంజా, ఎందుకంటే ఆయన ఈ ఓటీటీ షో సహా మామూలు వెర్షన్ కు కూడా అంటే ఒకే సంవత్సరంలో రెండు సార్లు రెమ్యునరేషన్ అందుకుంటాడని అంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీజన్లో 24 గంటల స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. సాధారణంగా తెలుగు బిగ్ బాస్ ఒక సీజన్ ముగిశాక మరొక సీజన్ స్టార్ట్ కావడానికి.. మధ్యలో తొమ్మిది నెలల గ్యాప్ తీసుకుంటారు. కానీ ఈసారి ముందే వచ్చేస్తున్నారు.

Also Read : Ramesh Babu : సూపర్ స్టార్ ఇంట తీవ్ర విషాదం – రమేష్ బాబు కన్నుమూత

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి