iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ కార్యాలయం వద్ద బిగ్ బాస్ బ్యూటీపై దాడి!

  • Published Sep 30, 2023 | 3:30 PM Updated Updated Sep 30, 2023 | 3:30 PM
కాంగ్రెస్ కార్యాలయం వద్ద బిగ్ బాస్ బ్యూటీపై దాడి!

బాలీవుడ్ లో వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతో పాపులర్ అయ్యింది. ఈ షోకి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ ఇప్పడు ఇతర భాషల్లో కూడా వస్తున్న విషయం తెలిసిందే. తెలుగు  బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కి నాని హూస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగులో వస్తున్న బిగ్ బాస్ కి అక్కినేని నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు గా వచ్చిన వారు తర్వాత సినీ ఇండస్ట్రీలో ఛాన్సులు సంపాదించారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్ పై దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ బిగ్ బాస్ తో పాపులర్ అయిన అర్చన గౌతమ్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు.  న్యూ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ హై కమాండ్ ని కలిసేందుకు ఆమె తన తండ్రితో కలిసి హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె పై దాడి జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ కార్యాలయంలోకి రావొద్దని కొంతమంది కార్యకర్తలు ఆమెను అడ్డుకోవడమే కాదు.. వారిద్దరినీ అక్కడ నుంచి తరిమేశారని, దాడి కూడా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంతో ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేకి అభినందనలు తెలపడానికి అర్చన గౌతమ్ వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారిని కలవడానికి దరఖాస్తు చేసుకోవడానికి పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వారిని పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వీరిలో కొంతమంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అర్చన గౌతమ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనిపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Himanshu Aswal Levels (@news_bufff)

 

View this post on Instagram

 

A post shared by Himanshu Aswal Levels (@news_bufff)