iDreamPost

Pallavi Prashanth: బిగ్ బాస్ టైటిల్ గెలవడం నుంచి అరెస్టు వరకు.. పూర్తి వివరాలు ఇవే!

  • Published Dec 21, 2023 | 3:46 PMUpdated Dec 21, 2023 | 3:54 PM

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్ విధించి.. చంచల్ గూడ జైలుకు తరలించారు. అసలు పల్లవి ప్రశాంత్ ను ఎందుకు అరెస్ట్ చేశారు.. బిగ్ బాస్ ఫినాలే రోజు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పూర్తి వివరాలు మీ కోసం..

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్ విధించి.. చంచల్ గూడ జైలుకు తరలించారు. అసలు పల్లవి ప్రశాంత్ ను ఎందుకు అరెస్ట్ చేశారు.. బిగ్ బాస్ ఫినాలే రోజు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పూర్తి వివరాలు మీ కోసం..

  • Published Dec 21, 2023 | 3:46 PMUpdated Dec 21, 2023 | 3:54 PM
Pallavi Prashanth: బిగ్ బాస్ టైటిల్ గెలవడం నుంచి అరెస్టు వరకు.. పూర్తి వివరాలు ఇవే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. చంచల్ గూడ జైలుకు తరలించింది. అసలేం జరిగింది.. ఎందుకు ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు.. అతడిపై నమోదైన కేసు ఏంటి.. అసలు గ్రాండ్ ఫినాలే రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం..

గ్రాండ్ ఫినాలే రోజున గొడవ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బీభత్సం సృష్టించారు. అంతేకాక ఫైనల్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న అమర్ దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొందరు దాడికి దిగారు. కేవలం కార్లపై మాత్రమే కాకుండా అటు వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కూడా దాడి చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం సీరియస్ అయ్యారు. అభిమానం పేరుతో ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కరెక్ట్ కాదన్నారు.

పోలీసుల మాటలు వినని ప్రశాంత్..

స్టూడియో బయట గొడవ జరుగుతుండటంతో.. బిగ్ బాస్ యాజమాన్యం.. పోలీసుల సాయంతో.. బ్యాక్ డోర్ గుండా పల్లవి ప్రశాంత్ ని బయటకు పంపించారు. అంతేకాక శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్‌ను అక్కడ ఆగకుండా వెంటనే వెళ్లిపోమ్మని సూచించారు పోలీసులు. కానీ ప్రశాంత్ మాత్రం రైతుబిడ్డకు విలువిస్తలేరంటూ పోలీసులనే వీడియోలు తీస్తూ దురుసుగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లిపోయిన కాసేపటికే పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ప్రశాంత్‌ మళ్లీ అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చాడు. దాంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ట్రోఫీ ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది.

పల్లవి ప్రశాంత్‌పై కేసు..

పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ.. ఆ తర్వాత అతడు పోలీసుల మాటలు వినకుండా తిరిగి రావడంతో పరిస్థితి తీవ్రత మరింత పెరింది. దాంతో సుమోటోగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్‌పై కేసులు నమోదయ్యాయి. అలానే అశ్విని, గీతూ రాయల్ కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులు మీద కేసు నమోదు చేశారు.

మీడియాను అవమానించిన ప్రశాంత్..

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్.. మీడియా వాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి తన ఊరికి రావాలని చెప్పాడు. స్వగ్రామానికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో సభ నిర్వహించి రచ్చ చేశాడు. పెద్ద ర్యాలీ తీశారు. గజ మాలలు వేసి సత్కరించారు. ఇక ప్రశాంత్ కూడా బొమ్మ గన్నులు పట్టుకుని ఫోజులు ఇచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి. అంతేకాక మీడియా వాళ్లను గంటల తరబడి వెయిట్ చేయించి.. చివరకు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా.. వారికి రకరకాల కండీషన్ లు పెట్టడం మాత్రమే కాక అవమానించాడనే విమర్శలు కూడా వచ్చాయి.

ఫోన్ స్విచ్చాఫ్.. పరారీలో ప్రశాంత్

ఇక ర్యాలీలు అన్ని ముగిసిన తర్వాత.. కేసులు నమోదైన అంశం పల్లవి ప్రశాంత్ కు తెలియడంతో.. అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడని.. పరారీలోకి వెళ్లాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అతడి కోసం 3 పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి.

నేనేక్కడికి పోలేదు..

ఈ వార్తలపై స్పందిస్తూ పల్లవి ప్రశాంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. తాను ఎక్కడకు వెళ్లలేదని.. తన ఇంట్లో ఉన్నానని చెప్పాడు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశాడు. కానీ ఎక్కడ కూడా ప్రశాంత్ అభిమానులు చేసిన పనిని ఖండించలేదు. పైగా జరిగిన గొడవ గురించి చెబితే.. నేనేం చేయ్యాలి.. నేనేం చేశాను అనడం చాలా మందికి కోపం తెప్పించింది. ఈలోపు పోలీసులు పల్లవి ప్రశాంత్ ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు ఏ-1గా చేర్చారు.

ప్రశాంత్ అరెస్ట్..

పబ్లిక్ న్యూసెన్స్ కేసులో భాగంగా పోలీసులు ఏ-1గా ఉన్న పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఈ కేసులో ఏ2గా ఉన్న ఆయన తమ్ముడు రవిరాజును గజ్వేలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ స్వగ్రామమైన గజ్వేలు మండలం కొల్గూరులో అతడి నివాసం వద్దే అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్ లో విచారించి.. ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ ని ప్రవేశపెట్టారు. కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ప్రశాంత్ తో పాటు అతడి సోదరుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ప్రశాంత్ అరెస్ట్.. కంటెస్టెంట్ల మద్దతు

పల్లవి ప్రశాంత్ అరెస్ట్ నేపథ్యంలో సోహైల్, అశ్వినీ రాయ్, భోళే షావలి వంటి వారు మద్దతిస్తున్నారు. ప్రశాంత్ అమాయకుడు.. అతడి చుట్టూ ఉన్న వారే ప్రశాంత్ ని తప్పుదోవ పట్టించారని తెలిపారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

 

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి